Home> వినోదం
Advertisement

Avram Manchu: బాబాయి బాటను ఫాలో అవుతున్న మంచు విష్ణు కొడుకు.. అందుకే ఇలా..?

Avram Manchu: మంచు విష్ణు కి కన్నప్ప సినిమా పైన ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో కష్టపడి మంచి ఫ్యామిలీ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ప్రేక్షకులకు ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మంచి విష్ణు కొడుకు అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.

Avram Manchu: బాబాయి బాటను ఫాలో అవుతున్న మంచు విష్ణు కొడుకు.. అందుకే ఇలా..?

Avram Manchu first look: భారీ బడ్జెట్ తో మంచి ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన.. ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. కన్నప్ప చిత్రంపై తెలుగు వారికే కాకుండా ఇతర భాషలవారికి కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్.. విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు కొడుకు..అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ విరుదల చేశారు.

విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో తెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కన్నప్పలో అవ్రామ్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా.. డా.మంచు మోహన్ బాబు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. మంచు ఫ్యామిలీ మూడో తరం నుంచి.. వస్తోన్న మొదటి వారసుడు కావడంతో.. అవ్రామ్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. 

ఈరోజు విడుదల చేసిన పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాత విగ్రహం డిజైన్ కూడా అదిరిపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ సినిమాలో తిన్నడు బాల్యానికి సంబంధించిన లుక్‌లో అవ్రామ్ కనిపించబోతున్నాడు. అయితే ఈ ఫస్ట్ లుక్ గురించి కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం అందరూ అబ్బాయి.. బాబాయి బాటను ఫాలో అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే మంచు మనోజ్ చిన్నప్పుడు.. ఎన్నో మోహన్ బాబు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. మోహన్ బాబుకి సూపర్ సక్సెస్ ఇచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మొదటిగా మంచు మనోజ్ కనిపించడం విశేషం. అప్పట్లో మోహన్ బాబుకి ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. ఇప్పుడు మంచి విష్ణువుకి కూడా తన కన్నప్ప చిత్రంపై అన్ని అంచనాలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు ఆ సినిమాతో తన కొడుకుని చిత్రరంగంలోకి ప్రవేశపెట్టినట్టు.. ఇప్పుడు విష్ణు కూడా తన కొడుకుని ఈ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయిస్తున్నారు. మొత్తానికి ఇలా బాబాయ్ బాటలో ప్రయాణిస్తూ మన విష్ణు కొడుకు ఎంతటి విషయం సాధిస్తారో వేచి చూడాలి.

కాగా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై.. మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ చిత్రం పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More