Home> వినోదం
Advertisement

Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!

Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!

Kannappa Runtime: గత కొంతకాలంగా సినిమాలకు.. దూరంగా ఉంటున్న మంచు విష్ణు మళ్ళీ ఇన్నాళ్ళకి హీరోగా కన్నప్ప సినిమాతో.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫ్యాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కూడా క్యామియో పాత్రలో.. కనిపించనున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడింది. 

ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత.. లాస్ట్ లో సినిమా ఫుటేజ్ చూస్తే ఏకంగా 52 గంటలు ఉందట. దానిని కష్టపడి.. మూడు గంటలకి ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. 

ఐదు, పది నిమిషాలు ట్రిమ్ చేస్తేనే సినిమా కథ చాలా పోయింది అని బాధపడే దర్శకులు ఉన్నారు. ఇక అన్ని గంటల షూటింగ్ తీసేస్తే సినిమాలో మిగిలేది.. ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 52 గంటల్లో ఇప్పుడు.. రన్ టైన్ ను 3 గంటలకు కుదించారు. 

దాదాపు 49 గంటల షూటింగ్ వేస్ట్ అయిపోయినట్లే. దానికోసం ఎంతోమంది కష్టపడి ఉంటారు. నిర్మాత కూడా ఎంతో డబ్బులు.. కూడా ఖర్చు చేసి ఉంటారు. మరి అవన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరేమో ఎంత సినిమా.. తీసిన నిర్మాత సొంత నాన్న అయినప్పటికీ బడ్జెట్  ఈరకంగా వేస్ట్ చేయడం ఏమీ బాలేదని చెబుతున్నారు.  

అయితే ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే. కాబట్టి సినిమా యూనిట్ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలి.  ఇక సినిమాలో శివుడి పాత్రలో.. అక్షయ్ కుమార్ నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారట. వీరిని చూడటానికి కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈమధ్యే విడుదల అయిన చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సంగతి ఏమో కానీ.. ట్రైలర్ లో విజువల్స్ జస్ట్ యావరేజ్ అంటున్నారు ప్రేక్షకులు. పైగా టీజర్ మొత్తం కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఇంకేం కనపడలేదు. మరి సినిమాల అయినా కాస్త ఎమోషన్స్ వంటివి వుంటాయో లేదో చూడాలి.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More