Home> వినోదం
Advertisement

Manchu Vishnu Comments: మంచు విష్ణు వార్నింగ్ మెగా క్యాంపుకేనా.. ఆ మాటలకి అర్థమదేనా?

Manchu Vishnu Indirectly Targets Mega Camp: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మెగా క్యాంప్ వ్యక్తులను మంచు విష్ణు టార్గెట్ చేసి కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు 

Manchu Vishnu Comments: మంచు విష్ణు వార్నింగ్ మెగా క్యాంపుకేనా.. ఆ మాటలకి అర్థమదేనా?

Manchu Vishnu Indirectly Targets Mega Camp: 2021 అక్టోబర్ నెలలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ చూసి ఎన్నికలు సాధారణ ఎన్నికలకు తలపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజుకి మద్దతు తెలుపగా మోహన్ బాబు సహా బాలకృష్ణ వంటి వారు మంచు విష్ణుకి మద్దతు తెలిపారు. దీంతో హోరాహోరీగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పెద్ద ఎత్తున మీడియాకి ఎక్కి మరీ ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. అదే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులలో కొంతమంది మీద మంచు విష్ణు కొన్ని ఆరోపణలు చేశారు.

ఇప్పుడు తాజాగా అవే ఆరోపణలను మళ్లీ మంచు విష్ణు తెర మీదకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన నేపథ్యంలో మంచు విష్ణు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశా.  అదేమిటంటే ఇకమీద రెండు సినిమాల్లో నటించి అవి విడుదలైతేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని అలాగే ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వారికి అసోసియేట్ గా సభ్యత్వం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆ అసోసియేట్ సభ్యులుగా ఉన్న వారికి ‘మా’లో ఓటు హక్కు ఉండదని ఆయన పేర్కొన్నారు.

నిజానికి గతంలో మెగా క్యాంపుకు చెందిన సురేష్ కొండేటి ఒక జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ అయిన వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోకి ఎలా వచ్చాడని విష్ణు ప్రశ్నించారు. ఒక డబ్బింగ్ సినిమా కొనుగోలు చేసి దానిలో ఒక పాట షూట్ చేసి ఆ పాటలో నటించినంతమాత్రాన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు అయిపోతారా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే నిజానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన కొండేటి సురేష్ అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికయ్యారు కూడా. కానీ ప్రకాష్ ప్యానల్ అంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సురేష్ కొండేటి కూడా రాజీనామా చేశారు. అప్పట్లోనే సురేష్ కొండేటి మీద మంచు విష్ణు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు.

ఇక ఇప్పుడు మంచు విష్ణు ‘మా’కు వ్యతిరేకంగా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారు సభ్యులుగా ఉండడానికి అనర్హులు అవుతారని, ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు తీసుకువెళ్లి వారిని అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులు ఉన్నారని పేర్కొనడంతో మెగా క్యాంపుకు చెందిన వారిని పక్కకు తప్పించే యోచనలో విష్ణు ఉన్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా కార్యవర్గ సభ్యులైన ధర్నా చేసినా, మీడియా ముందుకు వెళ్లిన వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొనడం చూస్తుంటే ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మంచు విష్ణుకు గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వారు అలాగే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని టార్గెట్ చేయడం కోసమే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

మరి ముఖ్యంగా మెగా క్యాంపుగా పేరొందిన మా సభ్యుల మీద మంచు విష్ణు దృష్టి పెట్టారా అనే చర్చ కూడా జరుగుతోంది. మంచు విష్ణు ప్రస్తుతం ప్రకటించిన కొన్ని నిర్ణయాలను మెగా క్యాంప్ తప్పుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అని మీడియా ముందుకు వారు వస్తే కనుక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని శాశ్వతంగా అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నామని చెబుతూ తొలగించినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద మెగా క్యాంప్ ఈ వ్యవహారం మీద ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా నాగబాబు నుంచి ఎలాంటి స్పందన రాబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను కాకుండా అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణుని టార్గెట్ చేసి నాగబాబు కామెంట్ చేసినా అసోసియేషన్ అధ్యక్షుడు అయిన తనను టార్గెట్ చేసి కామెంట్ చేశారనే ఉద్దేశంతో ఆయనను తొలగించినా తొలగించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారం మాత్రం ఎంత దూరం వెళ్లబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఒక హీరో తనను కావాలని డబ్బులు ఇచ్చి మరి మనుషుల్ని పెట్టించి ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపించిన మంచు విష్ణు ఆ హీరో ఎవరనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మెగా క్యాంప్ ని టార్గెట్ చేసి మంచు విష్ణు ఈ కామెంట్లు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి మరి. 

Also Read: Manchu Vishnu Warning: "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం.. మంచు విష్ణు వార్నింగ్!

Also Read: Pooja Hegde Birthday: ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలు(ఫోటోలు)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More