Home> వినోదం
Advertisement

Manchu Manoj Video: మొన్న అన్నకి షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ!

Manchu Manoj Video about Anniversary: మంచు మనోజ్ మంచు విష్ణు మీద షేర్ చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు మనోజ్ మరో వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. 

Manchu Manoj Video: మొన్న అన్నకి షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ!

Manchu Manoj Shared another Video: మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఏదో జరిగిపోయింది అంటూ ఆ మధ్య ఒక హాట్ న్యూస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు తన కుటుంబ సభ్యుల మీద రుబాబు చేస్తాడు అంటూ మంచు మనోజ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేయడంతో మీడియా దానిమీద రకరకాల కథనాలు వండి వార్చింది. ఆ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత ఇదంతా కూడా ఒక ప్రాంక్ అనే ప్రచారం జరిగింది.

ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా షేర్ చేశారు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో చేస్తున్నామంటూ ఆయన ఈ వివాదాన్ని పక్కకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ వివాదం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండడంతో దాన్ని పక్క దారి పట్టించాలని ఇలా ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేశారనే ప్రచారం కూడా ఉంది. కానీ అసలు విషయం ఏంటి అనేది మంచు కుటుంబ సభ్యులకే తెలియాలి.

fallbacks

అలా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి పెద్ద రచ్చకు కారణమైన మంచు మనోజ్ ఇప్పుడు మరో వీడియో షేర్ చేశారు. అయితే ఈసారి రచ్చ రేపే వీడియో కాదండోయ్ తన ప్రేమను బయట పెట్టే వీడియో అసలు విషయం ఏమిటంటే భూమా మౌనికను మంచు మనోజ్ వివాహం చేసుకుని ఈ రోజుకు సరిగ్గా నెల రోజులు పూర్తయ్యాయి.

మార్చి మూడవ తేదీన ఆయన భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచాడు. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ భార్య మౌనికతో ఉన్న ఒక లవ్లీ వీడియోని ఇంస్టాగ్రామ్ లోని స్టోరీస్ లో షేర్ చేశారు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు అంటూ ఒక క్యాప్షన్ పెట్టి ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మీదట చల్లగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని వారంతా ఆయనను కోరుకుంటున్నారు. 

Also Read: Balagam Movie Brothers: ఏళ్లగా అన్నదమ్ముల స్థలం తగాదా.. బలగం చూసి ఏడ్చేసి ఒక్కటయ్యారు!

Also Read: Nayanathara Son Names: ఉయిర్, ఉలగ్..నయనతార కొడుకులకు ఇంట్రెస్టింగ్ నేమ్స్..అర్ధం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 
Read More