Home> వినోదం
Advertisement

వైఎస్సార్ పాత్రలో.. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి..!

దివంగత నేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మళయాల నటుడు మమ్ముట్టి నటించబోతున్నారు.

వైఎస్సార్ పాత్రలో.. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి..!

దివంగత నేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మళయాల నటుడు మమ్ముట్టి నటించబోతున్నారు. వైఎస్సాఆర్ జీవిత కథ ఆధారంగా 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో మమ్ముట్టి నటిస్తున్నారు.  'ఆనందో బ్రహ్మ' చిత్రానికి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ్‌ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. "యాత్ర" పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మమ్ముట్టి తెలుగులో "స్వాతిముత్యం" చిత్రంలో నటించారు.

అలాగే ఆయన నటించిన అనేక సినిమాలు మలయాళం నుండి తెలుగులోకి డబ్ అయ్యి కూడా విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ బయోపిక్‌లో నటించిన మమ్ముట్టి ఆ తర్వాత.. నటిస్తున్న రెండవ బయోపిక్ "యాత్ర" కావడం విశేషం. గతంలో కూడా వైఎస్సార్ జీవితకథ ఆధారంగా "భగీరథుడు" పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. అందులో వినోద్ కుమార్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి గిరిరెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే "జగన్నాయకుడు" అనే పేరు మీద వైఎస్ జగన్ రాజకీయ నేపథ్యంలో పిసి రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం కూడా తెరకెక్కుతుంది. అందులో నటుడు భానుచందర్ వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు

Read More