Home> వినోదం
Advertisement

Malayalam heroines: టాలీవుడ్ నిర్మాతలతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మలయాళం భామలు..!

Malayalam heroines in Telugu: ప్రస్తుతం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో.. తెలుగు అమ్మాయిల కొరత ఎక్కువగానే ఉంది. అందరికంటే ఎక్కువగా మలయాళం.. హీరోయిన్ల హవా ఇప్పుడు టాలీవుడ్ లో బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా మలయాళం హీరోయిన్ల వెనకపడుతున్నారు. కానీ క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకోవాలి అన్న ఆలోచనతో.. తెలుగు నిర్మాతలు కొత్త తలనొప్పులు తల మీద వేసుకుంటున్నట్లు.. అనిపిస్తోంది.

Malayalam heroines: టాలీవుడ్ నిర్మాతలతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మలయాళం భామలు..!

Malayalam actresses in Tollywood: పేరుకు మనది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ.. హీరోయిన్ల జాబితా చూస్తే మాత్రం అందరూ మలయాళం హీరోయిన్ లే కనిపిస్తారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు.. టాలివుడ్ నిర్మాతలు తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువగా.. పరభాష హీరోయిన్ల మీద ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇక మిగతా ఇండస్ట్రీ లతో పోలిస్తే టాలీవుడ్ లో ఉండే వెసులుబాట్లు, రెమ్యూనరేషన్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హీరోయిన్లు కూడా ఏమాత్రం మొహమాట పడకుండా ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. 

అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ వంటి హీరోయిన్లు కేవలం ఒక సినిమా కోసం టాలీవుడ్ లో అడుగుపెట్టిన వారే. కానీ ఆ తర్వాత మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయారు. వేరే భాషల సినిమాలు చేయడంలో ఎటువంటి తప్పులేదు కానీ.. టాలీవుడ్ నిర్మాతలతో మలయాళం హీరోయిన్లు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటారు.

అన్నిటికంటే ఎక్కువగా టాలీవుడ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టే విషయం హీరోయిన్ల డేట్లు. చేతినిండా సినిమాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి అన్నట్లు.. హీరోయిన్లు వరుసగా సినిమాలు సైన్ చేసేస్తూ ఉంటారు. ఒకేసారి రెండు మూడు సినిమాలతో బిజీ అవుతుంటారు. ఆ సమయంలో డేట్ లు కావాలి అనుకున్నప్పుడు టాలీవుడ్ నిర్మాతలకి చాలా ఇబ్బంది అవుతుంది. 

పోనీ ఇంత కష్టపడి హీరోయిన్ డేట్ లు దొరికితే సంతోషించాలా అంటే.. సెట్ కి రావడం ఆలస్యం తమకి ఇచ్చే రెమ్యునరేషన్ కాకుండా.. తమతో పాటు వచ్చే వారి మీదే నిర్మాతలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. వాళ్లతో పాటు వస్తున్న వారి కుటుంబ సభ్యులకు, స్టాఫ్ కి, ఇలా అందరికీ ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్ బుకింగ్ లు, ఫుడ్ ఇలా నిర్మాతలు చాలానే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 

మలయాళం ఇండస్ట్రీలో చాలా రూల్స్ ఉంటాయి. కేవలం కొందరు అనుభవం ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే వాళ్ల ముందు తలదించుకోవాల్సిందే. ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒక సినిమా మీద మాత్రమే పని చేయాలి.. ఆ సినిమా పూర్తయిన తర్వాతే మరొక సినిమా మొదలు పెట్టాలి అనేది మొదటి రోల్. పోనీ రూల్స్ ఫాలో అయ్యి ఇండస్ట్రీలో నెట్టుకురావాలి అన్నా కూడా.. టాలీవుడ్ తో పోలిస్తే అక్కడ రెమ్యూనరేషన్ లు చాలా తక్కువగా ఉంటాయట. 

మరోవైపు తెలుగు ప్రేక్షకులు నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. ఈ రకంగా మలయాళం హీరోయిన్లు టాలీవుడ్ నిర్మాలను ఎంత ఇబ్బంది పెట్టినా.. ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్ గా బాగానే ఎదుగుతున్నారు. అయితే అందరూ మలయాళం హీరోయిన్లు నిర్మాతలను ఇబ్బంది పెట్టే వాళ్లే అయి ఉండరు. శోభన, నయనతార, మంజు వారియర్, పార్వతి, ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అన్నా బెన్, అనంతిక సనీల్ కుమార్ వంటి వారు నిర్మాతలను గౌరవించి పనిచేస్తూ ఉంటారు.

Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 

Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More