Home> వినోదం
Advertisement

Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..

Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.

Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..

Jayaram Daughter Wedding: జయారాం మలయాళంలో దాదాపు పాతికేళ్లు హీరోగా సత్తా చూపెట్టాడు. అక్కడ హీరోగా.. విలన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటాడు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో తండ్రి పాత్రలో ఇక్కడి ప్రేక్షకులు దగ్గరయ్యాడు. అటు పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈయన కూతురు పెళ్లి కేరళలోని గురవాయుర్‌లోని ఓ ఆలయంలో ఎంతో సింపుల్‌గా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. కేరళకు చెందిన నవనీత్ గిరిశ్‌తో జయరాం కూతురు మాళవిక పెళ్లి జరిగింది.  

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా జయరాం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాడు. అలాగే హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ తండ్రి పాత్రలో నటించారు. మొత్తంగా మలయాళ నటుడు అయినా.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More