Home> వినోదం
Advertisement

Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Basil Joseph Blessed with Baby Girl మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలిపోతోన్నాడు. పాప పుట్టిందంటూ బసిల్ జోసెఫ్ ఎమోషనల్ అవుతూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Basil Joseph Blessed with Baby Girl మాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో బసిల్ జోసెఫ్‌ ఇప్పుడు తండ్రి అయ్యాడు. తనకు బుధవారం పాప పుట్టిందంటూ.. మాలో ఆనందాలను నింపేసిందంటూ ఎమోషనల్ అయ్యాడు. మా ఈ బుజ్జి పాప మా జీవితంలో సంతోషాలను తీసుకొచ్చింది.. మా హృదయాలను ఆల్రెడీ దోచేసింది.. మా పాపను చూస్తుంటే ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంది.. మా పాప ఎదుగుతూ ఉంటే చూడాలని, ఆమె నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆత్రుత ఎక్కువగా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు.

 

 

బసిల్ జోసెఫ్‌కు డైరెక్టర్‌గా ఎంత మంచి పేరు ఉందో.. నటుడిగానూ అంతే మంచి పేరు ఉంది. మిన్నల్ మురళి, గోదా వంటి సినిమాలు జోసెఫ్‌ను అందరికీ పరిచయం చేశాయి. ఇక జయ జయ జయహే అంటూ వచ్చిన సినిమాలో హీరోగా కనిపించాడు జోసెఫ్. దర్శన, జోసెఫ్‌ల నటనకు అంతా ఫిదా అయ్యారు. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది.

అసలే ఇప్పుడు ఇండస్ట్రీల్లో ఓ ట్రెండ్ నడుస్తోంది. హీరోయే డైరెక్టర్ అవుతున్నాడు.. డైరెక్టర్లే హీరోలు అవుతున్నారు.. లిరిక్ రైటర్లుగా మారుతున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు హీరో కమ్ డైరెక్టర్‌ అనే ట్యాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ కేటగిరీలో రిషభ్ శెట్టి, బసిల్ జోసెఫ్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ముందుంటారు.

బసిల్ జోసెఫ్‌ తండ్రి అవ్వడంతో సెలెబ్రిటీలంతా కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. బసిల్ జోసెఫ్, ఎలిజబెత్‌కు 2017లో వివాహాం అయిన సంగతి తెలిసిందే. ఆరేళ్లకు వీరు తల్లిదండ్రులు అవ్వడంతో గాల్లో తేలిపోతోన్నారు.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More