Home> వినోదం
Advertisement

OTT Streaming: ఓ వైపు వివాదం..అయినా ఆగని కేరళ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్

OTT Streaming: వేసవి సెలవులు కావడంతో ఓటీటీ క్రేజ్ మరింతగా పెరిగింది. అందుకే కొత్త సినిమాలు సైతం నెల తిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేసింది
 

OTT Streaming: ఓ వైపు వివాదం..అయినా ఆగని కేరళ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్

OTT Streaming: వేసవి వచ్చిందంటే సినిమాలకు పండగే పండగ. సెలవులు కావడంతో కాలక్షేపం కోసం ఎక్కువగా సినిమాలే కన్పిస్తాయి. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాల సందడి బాగా పెరిగిందనే చెప్పవచ్చు. ఇప్పుడు మరో సూపర్ హిట్ సెన్సేషనల్ సినిమా ఓటీటీ ప్రేమికులను ఆకర్షిస్తోంది.

మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 2018. కేరళ వరదల ఆదారంగా తెరకెక్కిన సినిమా ఇది. మలయాళంలో అద్భుత విజయం సాధించడమే కాకుండా 160 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. మే 5న కేరళలో విడుదల కాగా, అదే నెల 26 వతేదీన తెలుగులో కూడా విడుదలైంది. ఇవాళ్టి నుంచి అంటే జూన్ 7 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. 

ఆంథోని జోసెఫ్ తెరకెక్కించిన 2018 సినిమాలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న సోనీ లివ్ ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. మలయాళం, తెలుగు రెండు భాషల్లో కూడా సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా ఇది. అయితే ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేయడంపై కేరళలో వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రంలోని థియేటర్ యజమానాలు ఇవాళ, రేపు అంటే జూన్ 7, 8 తేదీల్లో నిరసనకు తెరతీశారు. ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చేస్తే తాము 200 కోట్ల వరకూ నష్టపోతామని కేరళ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. 

ఈ వారం ఓటీటీ, ధియేటర్ విడుదల సినిమాలివే

జూన్ 9వ తేదీన అమెజాన్ మినీ టీవీలో బద్ తమీజ్ దిల్ స్ట్రీమ్ కానుంది. ఇక జూన్ 15 వతేదీన జియో సినిమాలో రఫు చక్కర్ విడుదలవుతోంది. జూన్ 16వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌ట్రాక్షన్ 2 స్ట్రీమ్ కానుండగా, జూన్ 16నే ఐ లవ్ యూ సినిమా జియో సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవాళ్టి నుంచి సోనీలివ్‌ల ో2018 సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. 

Also read: Adipurush Pre Release Event: 'ఆది పురుష్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్‌!

ఇక థియేటర్ విడుదల విషయంలో మూడు సినిమాలున్నాయి. జూన్ 9వ తేదీన తమిళ సినిమా విమానం విడుదల కానుండగా, అదే రోజు మరో తమిళ సినిమా టక్కర్ విడుదలకు సిద్ఘంగా ఉంది. ఇక జూన్ 10వ తేదీన హాలీవుడ్ సినిమా స్టాన్ లీ విడుదల కానుంది.

Also read: Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More