Home> వినోదం
Advertisement

Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!

Malaika Arora crush on Tom Cruise. హాలీవుడ్ అందగాడు టామ్ క్రూజ్‌పై తనకు క్రష్ ఉందని బాలీవుడ్ హాట్ బ్యూటీ 'మలైకా అరోరా' చెప్పారు. 
 

Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!

Malaika Arora crush on Hollywood handsome Tom Cruise: బాలీవుడ్ హాట్ బ్యూటీ 'మలైకా అరోరా' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆమెను చూసి యువ హీరోయిన్‌లు ఈర్ష పడుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మలైకా ఫిగర్‌కి ఫిదా కానీ అభిమాని ఉండడు. 12-13 ఏళ్ల కొడుకు ఉన్నా.. మలైకాలో అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ వయసులోనూ అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. 

మలైకా అరోరా బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత 4-5 సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి వెకేషన్స్, పార్టీస్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అర్జున్ ఫామిలీలో జరిగే ఫ్యాక్షన్స్‌కు కూడా మలైకా వెళుతున్నారు. తరచుగా అర్జున్ ఇంటికి బాలీవుడ్ హాట్ బ్యూటీ వెళుతుంటారు. అర్జున్-మలైకా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. ఈ జంట ఇప్పటివరకు కూడా పెళ్లిపీటలెక్కలేదు. అయితే మలైకా మరో హీరోపై కన్నేశారట.

67వ వోల్ఫ్ 777 న్యూస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 మంగళవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. అందులో మలైకా అరోరా కూడా ఉన్నారు. మలైకా పసుపు రంగు గౌనులో హొయలు పోయారు. ఈ ఈవెంట్‌లో మలైకా తన క్రష్ గురించి చెప్పారు. హాలీవుడ్ అందగాడు టామ్ క్రూజ్‌పై తనకు క్రష్ ఉందని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ విషయం చెప్పడానికి కొన్ని గంటల ముందు టామ్ క్రూజ్ రీల్‌ను ఆమె పోస్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అయింది. 

Also Read: Rishabh Pant: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్‌కు స్థానం లేదు: మాజీ సెలక్టర్

Also Read: Tarun on SSMB28: మహేష్ బాబు సినిమాలో తరుణ్.. అసలు విషయం చెప్పేశాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More