Home> వినోదం
Advertisement

Major OTT: ఓటీటీలోకి మేజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Major Movie streaming on netflix from june 3. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుండి ‘మేజ‌ర్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 
 

Major OTT: ఓటీటీలోకి మేజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Major Movie streaming on ott platform netflix: శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో యువ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం 'మేజర్‌'. ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో శేష్‌కు జోడీగా అందాల భామ సాయి మంజ్రేక‌ర్ నటించగా.. తెలుగమ్మాయి శోభితా ధూళిపాల కీల‌క‌ పాత్ర‌లో న‌టించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన మేజర్‌ సినిమా జూన్‌ 3న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. 

మేజర్‌ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మేజ‌ర్ పాత్ర‌లో అడివి శేష్ జీవించాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. దాంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం భారీ స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబట్టింది. అడివి శేష్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజ‌ర్ నిలిచింది. ఇప్ప‌టికే ఈ సినిమా నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మేజ‌ర్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుండి ‘మేజ‌ర్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌కటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. థియేట‌ర్‌లో విడుద‌లైన 30 రోజుల‌కు ఓటీటీలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. థియేట‌ర్‌లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా బాగానే ఆడనుంది. ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. 

Also Read: రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా! ఓపెనర్‌‌గా తెలుగు ప్లేయర్.. భారత తుది జట్టు ఇదే!

Also Read: Suchendra Prasad: 'పవిత్ర'ది అపవిత్ర బుద్ధి.. మరికొందరితో సంబంధాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More