Home> వినోదం
Advertisement

SSMB 28 Update: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఉగాదికి కూడా నో అప్డేట్ కానీ..

SSMB28 Update on Ugadi 2023: మహేష్‌ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ ఉగాదికి వస్తుందని అంతా అనుకున్నారు. అలానే ప్రచారం కూడా జరిగింది. అయితే టైటిల్ ఫిక్స్ కాలేదట. దీంతో  అప్డేట్‌ను వాయిదా వేశారు.

SSMB 28 Update: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఉగాదికి కూడా నో అప్డేట్ కానీ..

SSMB28 Update on Sri Rama Navami 2023: మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న మూడో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉగాదికి రావాల్సి ఉంది. కానీ దర్శకుడు, హీరోకి సినిమా టైటిల్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. అందుకే ఉగాదికి అప్డేట్ వస్తుందని ముందు లీకులు వదిలారు. తీరా టైంకు వచ్చే సరికి చేతులు ఎత్తేశారు. ఉగాదికి అప్డేట్ రావడం లేదని చెప్పేశారు. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్ డల్ అయ్యారు. అయితే శ్రీరామ నవమికి మాత్రం అప్డేట్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ప్రకారం 'అ' అనే అక్షరంతో టైటిల్‌ను ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాడట. అమ్మ కథ అనే టైటిల్ ఓకే చేసినట్టుగా టాక్ వచ్చింది. 'అమ్మ కథ', 'ఆమె కథ', 'అతడే తన సైన్యం' అంటూ ఇలా కొన్ని టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయట. అయితే మహేష్ బాబుకి ఒక టైటిల్ నచ్చితే.. త్రివిక్రమ్‌కి ఇంకో టైటిల్ నచ్చిందట. అందుకే ఇంకా ఎటువంటి నిర్ణయానికి టీం రాలేదని తెలుస్తోంది.

ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేయాలని అనుకున్నారు. ఇక టైటిల్ లేకుండా ఇవన్నీ చేయాలని కూడా భావించారట. కానీ టైటిల్‌ను ఎలాగైనా ఫిక్స్ చేయాలని, టైటిల్‌తో పాటే పోస్టర్లను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కావాలంటే ఉగాదికి అప్డేట్ ఇవ్వకపోయినా పర్లేదని ఫిక్స్ అయ్యారట. శ్రీరామ నవమికి మాత్రం అప్డేట్ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. సరైన టైంలో అప్డేట్ వస్తుందంటూ రామబాణం గుర్తును షేర్ చేశారు. 

ఆల్రెడీ సినిమా షూటింగ్‌ ఫుల్ స్వింగులో ఉంది. నిన్ననే పూజా హెగ్డే హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కూడా సెట్‌లోకి అడుగు పెట్టేశారు. ఇప్పటికే శ్రీలీల మహేష్‌ బాబు మధ్య వచ్చే సీన్లు అదిరిపోయాయనే టాక్ బయటకు వచ్చింది. అతడు సినిమాలో పూరి పాత్రను మించి ఉంటుందని, మహేష్ బాబు శ్రీలీల ట్రాక్ అద్భుతంగా ఉందని ఇన్ సైడ్‌ టాక్ వినిపిస్తోంది.

Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన

Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More