Home> వినోదం
Advertisement

Maama Mascheendra Trailer: మూడు గెటప్పుల్లో సుధీర్ బాబు.. ఆసక్తికరంగా 'మామా మశ్చీంద్ర' ట్రైలర్..

Sudheer Babu new Movie: హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష బాబు లాంచ్ చేశారు. మీరు చూసేయండి మరి.
 

Maama Mascheendra Trailer: మూడు గెటప్పుల్లో సుధీర్ బాబు.. ఆసక్తికరంగా 'మామా మశ్చీంద్ర' ట్రైలర్..

Maama Mascheendra Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నయా మూవీ మామా మశ్చీంద్ర. యాక్టర్ కమ్ రైటర్ గా గుర్తింపు పొందిన హర్షవర్దన్(Harshavardhan) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఈషా రెబ్బా, మిర్నాలి రవి, అభినయ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఓల్డ్, యంగ్, లావు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాయి.  ఈ చిత్రాన్ని సృష్టి సెల్యూలాయిడ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. మామా, మేనల్లుళ్ల మధ్య సాగే రివెంజ్ స్టోరీగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.  మేనల్లుడలకి మేనమామ పోలికలు రావడం, ఆ మావయ్య కూతుళ్లు తండ్రి రూపంతో ఉన్న హీరోలతో లవ్ లో పడటం, ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ మూవీని అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ షురూ చేయనుంది చిత్రయూనిట్. 

'SMS' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. విభిన్న తరహా కథలు ఎంచుకుని తన నటనతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకి హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువని చెప్పాలి. అయినా సరే సుధీర్ బాబు ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడు. మరో ఢిపరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మామా మశ్చీంద్ర సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. 

Also Read: Oscars 2024: తెలుగు సినిమాలకు మరోసారి నిరాశ... ఆస్కార్ బరిలో మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More