Home> వినోదం
Advertisement

BB 7 Telugu Finale Guest: బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu: డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 విన్నర్ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో ఫినాలే కోసం భారీగా ఫ్లాన్ చేస్తోంది స్టార్ మా. ఇందులో భాగంగానే ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నారట.
 

BB 7 Telugu Finale Guest: బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu Finale Chief Guest: బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు ఏ సీజన్ కి రానంత ఆదరణ సీజన్ 7కు వచ్చింది. అదిరిపోయే టాస్కులు, ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్ సాగిన బిగ్ బాస్ సీజన్ 07 చివరికి వచ్చేసింది. మరో మూడు రోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఉన్నారు. వారే శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక. కంటెస్టెంట్లకు వారి ఫ్యాన్స్ భారీగా ఓటింగ్ చేస్తున్నారు. టైటిల్ పోరు ముగ్గురు హౌస్ మేట్స్ మధ్య ప్రధానంగా నడుస్తోంది. వారికే అధికంగా ఓట్లు పోలవుతున్నాయి. డిసెంబరు 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్న నేపథ్యంలో ఎవరిని గెస్ట్ గా తీసుకువస్తారనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సీజన్ ఫినాలే ఈవెంట్ ను భారీగా ఫ్లాన్ చేయాలని నిర్ణయించిందట స్టార్ మా. అందులో భాగంగానే సెలెబ్రిటీలతో ఫెర్ఫార్మెన్సులు చేయించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫినాలేకు మెయిన్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు రాబోతున్నట్లు సమాచారం. గత సీజన్‍కు గెస్ట్ గా చిరంజీవి రాగా.. తాజా సీజన్‍కు మహేశ్ రావడం దాదాపు ఫిక్స్ అయింది. ఇక మహేష్ ఫినాలేకు వస్తున్నారంటే టీఆర్పీ రేటింగ్ ఏ లెవల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. మహేశ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించాడు. 

Also Read: ibomma fake website: Ibomma వెబ్ సైట్ అని క్లిక్ చేస్తే అంతే సంగతి..ఇందులో సినిమాలు చూసేవారు జర జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More