Home> వినోదం
Advertisement

Mahesh babu Depression: తీవ్ర డిప్రెషన్లో మహేష్, ఎవరితో మాట్లాడడం లేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు!

Mahesh babu in depression: వరుస విషాదాలు వెంటాడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, ఎవరితోనూ మాట్లాడడం లేదని అంటున్నారు, ఆ వివరాలు 

Mahesh babu Depression: తీవ్ర డిప్రెషన్లో మహేష్, ఎవరితో మాట్లాడడం లేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు!

Mahesh babu in depression and not taking any calls: సూపర్ స్టార్ మహేష్ కుటుంబంలో వరుసగా తీవ్ర విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనవరిలో తన సోదరుడు రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి ఇక ఇటీవల నవంబర్ నెలలో తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు ఒక రకంగా తీవ్రంగా కుంగుబాటుతో కూలిపోతున్నాడని చెప్పచ్చు. తనను అత్యంత ఆప్తులుగా భావించే ముగ్గురు వ్యక్తులు ఒకే ఏడాది వరుసగా మృత్యువాత పడుతూ రావడంతో మహేష్ ఇప్పటికి కూడా కోలుకోలేదని తెలుస్తోంది.

వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ ఇంకా జరగలేదు త్వరలోనే జరగబోతోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని అడవి శేషు తాజాగా వెల్లడించారు. ఇక అడవి శేషు ఈ మధ్యనే మహేష్ తో కలిసి మేజర్ అనే సినిమా చేశారు. మహేష్ మేజర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా మేజర్ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్రలో నటించారు. ఇక అడవి శేషు హిట్ 2 అనే సినిమా ద్వారా డిసెంబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఆ ఇంటర్వ్యూలు ఇస్తున్న నేపథ్యంలోనే మహేష్ బాబు గురించి ఆయన కొన్ని బాధాకరమైన విషయాలు బయట పెట్టారు. ప్రస్తుతానికి మహేష్ బాబు అనుభవిస్తున్న బాధాకరమైన పరిస్థితులు వర్ణించలేనివి, ఏ ఒక్కరూ కూడా ఇంత బాధను భరించాల్సింది కాదు, ప్రపంచంలో ఉన్న శక్తి అంతా ఆయనకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను అని అడవి శేషు పేర్కొన్నారు. అయితే మీరు కృష్ణ మరణించిన తర్వాత మహేష్ బాబును పిలవడం గాని ఓదార్చడం గానీ చేశారా అంటే అప్పుడు అడవి శేషు ఒక కీలకమైన విషయాన్ని బయట పెట్టారు.

ప్రస్తుతానికి మహేష్ బాబు ఎవరితోనూ మాట్లాడడం లేదని ఫోన్స్ కూడా ఎత్తడం లేదు అని చెప్పుకొచ్చారు. నేను నమ్రత గారితోనే టచ్ లో ఉంటూ పరిస్థితి ఎలా ఉందని విషయాన్ని తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అడివి శేషు చెప్పిన మాటలతో మహేష్ అభిమానులైతే బాధపడుతున్నారు. మహేష్ బాబు జీవితంలో ఎన్ని బాధలు ఒకేసారి రావాల్సింది కాదని ఎందరో చిన్నారులకు అండగా నిలబడుతూ వారి గుండె ఆపరేషన్లు చేస్తూ వస్తున్న మహేష్ బాబుకు ఇలాంటి గుండె కోత అవసరమా అని వాళ్లంతా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మనుషులందరికి ఈ కష్టాలు తప్పవని కాకపోతే మహేష్ బాబుకి ఒకేసారి ఇన్ని కష్టాలు రావడం మాత్రం భగవంతుడు ఆయనకు చేసిన అన్యాయమే అని కామెంట్ చేస్తున్నారు.

Also Read: Rashmika Mandanna: నోటి దురదకు భారీ మూల్యం..కన్నడ సినీ పరిశ్రమ నుంచి రష్మిక మందన్న బ్యాన్!

Also Read:  Mahesh Babu Hair: తల్లిదండ్రులు మరణించినా మహేష్ బాబు తలనీలాలు తీయని మహేష్.. బాధ్యత లేక కాదు అసలు కారణం ఇది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
Read More