Home> వినోదం
Advertisement

Super star Krishna last rites : ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. ఎన్ని తుపాకులు, ఎన్ని రౌండ్ల కాల్పులంటే?

Super star Krishna last rites సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మహా ప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుము ఈ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ యాత్రలో కృష్ణ అశేష అభిమానులు పాల్గొన్నారు.

Super star Krishna last rites : ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. ఎన్ని తుపాకులు, ఎన్ని రౌండ్ల కాల్పులంటే?

Super star Krishna last rites : సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి. సోమవారం (నవంబర్ 14) తెల్లవారుఝామున కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సోమవారం అంతా కూడా క్రిటికల్ కండీషన్‌లోనే చికిత్స అందించిన వైద్యులు చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుఝామున కృష్ణ తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఇక నిన్న కృష్ణ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని ప్రకటిస్తూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

నేడు (నవంబర్ 16) ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచగా.. ఏపీ సీఎం జగన్‌ వచ్చి నివాళులు అర్పించారు. బాలయ్య సైతం కృష్ణకు నివాళి అర్పించి మహేష్‌ బాబు ఓదార్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కాసేపటి క్రితమే కృష్ణ అంత్యక్రియలు నిర్వహించింది. 8 తుపాకులతో గాల్లోకి  3 రౌండ్లు కాల్పులు జరిపారు.

కాసేపటి క్రితమే మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో కృష్ణ అశేష అభిమానులు పాల్గొన్నారు. దారి పొడవునా చెమ్మగిల్లిన కళ్లతో కృష్ణను తలుచుకుంటూ భోరున విలపించసాగారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా, కేసీఆర్ ఆదేశించినట్టుగా ప్రభుత్వం అధికారికంగా, లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలను నిర్వహించింది.

మంగళవారం నాడు కృష్ణ మరణ వార్త తెలిసుకుని దేశ ప్రధాని కూడా సంతాపాన్ని ప్రకటించాడు. కేవలం టాలీవుడ్ ప్రముఖులే కాకుండా..సౌత్ మొత్తం సంతాపాన్ని ప్రకటించింది. చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఇలా స్టార్ హీరోలంతా కూడా మహేష్‌ బాబు ఓదార్చారు. కృష్ణకు నివాళులు అర్పించారు.

మహేష్‌ బాబు అయితే తన తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ అందరినీ పలకరిస్తున్నాడు. తాజాగా బాలయ్యవేసిన జోకులకు మహేష్‌ బాబు నవ్విన వీడియో అభిమానులకు కాస్త ఉపశమనంగా అనిపిస్తోంది. నిన్నటి నుంచి మహేష్‌ అన్నని బాధల్లోనే చూస్తున్నాం.. ఇలా నవ్వించినందుకు బాలయ్యకు థాంక్స్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

Also Read : Deepika Pilli Video : దీపిక పిల్లి.. మరీ ఇంత బుల్లి డ్రెస్సా?.. తెగ ఊపేస్తోన్న హాట్ యాంకర్

Also Read : Sitara Ghattamaneni Emotional Post : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. మిస్ యూ తాతగారు.. కదిలించిన సితార పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More