Home> వినోదం
Advertisement

Manchu Vishnu: హీరోయిన్లను అవమానిస్తే ఊరుకోను.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

Manchu Vishnu: హీరోయిన్స్ పై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని మంచు విష్ణు హెచ్చరించారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 

Manchu Vishnu: హీరోయిన్లను అవమానిస్తే ఊరుకోను.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

Manchu Vishnu: హీరోయిన్స్ పై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు(MAA President Manchu Vishnu) హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(Telugu Film Critics Association) సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు(Youtube Channels) నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

నటీమణులు మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విష్ణు(Manchu Vishnu) విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లను నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని తెలిపారు. 

Also read: Manchu Vishnu: 'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు

'మా' లోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంచు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘'విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌'’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ కమిటీ మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని.. ఆ కమిటీకి సలహాదారుగా సునీత కృష్ణన్(Sunita Krishnan) ఉంటారని.. అలాగే అందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని విష్ణు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More