Home> వినోదం
Advertisement

Maa Kaali Teaser Review:‘మా కాళీ’ టీజర్ రివ్యూ.. ‘రజాకార్’ ను మించిన బెంగాల్ రక్త చరిత్ర..

Maa Kaali Teaser Review: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమల్లో నిజీ జీవిత ఘటనల ఆధారంగా మరుగున పడిన చరిత్ర నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం ‘మా కాళీ’. తాజాగా విడుదలైన  ఈ టీజర్ ను చూస్తుంటే.. రజాకార్ ను మించి పోయింది.

Maa Kaali Teaser Review:‘మా కాళీ’ టీజర్ రివ్యూ.. ‘రజాకార్’ ను మించిన బెంగాల్ రక్త చరిత్ర..

Maa Kaali Teaser Review: ‘మా కాళీ’ అంటే అమ్మవారని అర్ధం. బెంగాలీ ప్రజల ఆరాధ్య దేవత. ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా మనకు 51  అమ్వారి శక్తి పీఠాలున్నాయి. అందులో కొన్ని పాకిస్థాన్ లో బలూచిస్థాన్ లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో డాకేశ్వరి దేవి శక్తి పీఠం ఉంది. డాకేశ్వరి దేవ శక్తి పీఠం పేరు మీదే బంగ్లాదేశ్ రాజధానికి ఢాకా అనే పేరు స్థిర పడిపోయింది. ఈ నేపథ్యంలో 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు ప్రీ  పార్టిషిన్ సమయంలో జరిగిన  నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘మా కాళీ’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు.

దేశ స్వాతంత్య్రానికి ముందు అక్కడ జరిగిన  సంఘటనలను అప్పటి ప్రభుత్వాలు బయటకు రానీలయలేదు. తాజాగా దర్శకుడు విజయ్ యెలకంటి అప్పటి ఘోర భయానక పరిస్థితులను కళ్లకు కట్టారు. ఈ టీజర్ లో మేము హిందువులను 500 యేళ్లు పరిపాలించాము. ఇపుడు ఆ కాఫిర్ల (హిందువుల) పాలనలో మనం బతకాల అంటూ కొంత మంది ముస్లిమ్స్ లీడర్స్ మాట్లాడిన మాటలతో ఈ టీజర్ మొదలవుతోంది. ఇ విభజించు పాలించు అనే సూత్రం ఆధారంగా భారత దేశాన్ని భారత్, పాకిస్థాన్ అనే రెండు ముక్కలు చేసి వెళ్లారు బ్రిటిష్ వాళ్లు.   

ఈ సందర్భంగా  ఇప్పటి బంగ్లాదేశ్ ఒకపుడు తూర్పు బెంగాల్ అనేవారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తూర్పు పాకిస్థాన్ గా పిలిచేవారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను అక్కడ ముస్లిమ్స్  ఎలా ఊచకోత కోసారు. హిందువులు మతం మారడమో.. లేకపోతే చనిపోవడమే అన్నట్టు ముష్కరులు.. హిందువులపై  దౌర్జన్య కాండను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు అప్పటి చరిత్రను చూపెట్టాడు దర్శకుడు.

మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో రజాకార్లు.. ఇక్కడి మెజారిటీ హిందువులపై ఎలాంటి దాష్టికాలు చేసారో.. అంతకు మించి పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లో అప్పట్లో జరిగిన  దారుణాలను ఈ సినిమాలో ఎండగట్టాడు. అపుడు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఈ విషయాలు తెలియకుండా చరిత్రను తొక్కి పట్టాయి. 1947లో విభజన సందర్బంగా ఏర్పడిన గాయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘మా కాళీ’ సినిమాను తెలుగు వాడైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్  నిర్మించడం మెచ్చుకోదగ్గ విషయమే. ఈ సినిమాను బెంగాలీతో పాటు హిందీ, తెలుగులో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు.

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More