Home> వినోదం
Advertisement

Telugu movies this week: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలివే!

Telugu Movies Releasing this week: చిన్న సినిమాలు సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఏయే సినిమాలు వస్తున్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.

Telugu movies this week: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలివే!

Telugu Movies Releasing this week: టాలీవుడ్ లో చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు,  పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగడంతో పాటు థియేటర్ల నుంచి దాదాపు తప్పుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిన్న సినిమాలు సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ మంచి డేట్లు చూసుకుంటున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఏ ఏ సినిమాలు వస్తున్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం. జూలై ఒకటో తేదీ విడుదల కావాల్సిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కడువా సినిమా జులై ఏడవ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన సంయుక్త మీనన్ నటించారు. వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు,  తమిళ,  మలయాళ, కన్నడ భాషలలో విడుదలవుతోంది. 

సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ హీరోగా కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్గా రాధికారవి,  కెఎస్ రవికుమార్ ప్రధాన పాత్రధారులుగా కిషోర్ దర్శకత్వం వహించిన మయాన్ అనే సినిమా కూడా జూలై 7వ తారీఖున విడుదలవుతుంది. అలాగే క్రిస్ హామ్స్,  క్రిస్టియన్ బాలే,  తిస్సా థామ్సన్ జైమీ అలెగ్జాండర్ ప్రధాన పాత్రలలో టైకా వైట్టీ దర్శకత్వం వహించిన థోర్ లవ్ అండ్ థండర్ మూవీ జూలై 7వ తేదీ విడుదలవుతోంది. మత్తువదలరా సినిమా దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి,  అగస్త్య నరేశ్,  సత్య,  వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన హ్యాపీ బర్త్డే సినిమా జూలై 8వ తేదీన విడుదలవుతోంది. ఇక ఎనిమిదో తేదీన సందీప్ మాధవ్ గాయత్రి సురేష్ జంటగా సాయికుమార్,  సురేష్,  బాబు మోహన్ వంటి వారు కీలకపాత్రధారులుగా రూపొందించిన  గంధర్వ సినిమా విడుదలవుతోంది అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుభాని నిర్మాతగా వ్యవహరించారు. 

నిర్మాత సురేష్ కొండేటి సినిమాని ప్రపంచవ్యాప్తంగా 500 ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. మైత్రి రెడ్డి,  స్నేహ బిజుక్త జంటగా కె మనోహర్ మల్లయ్య దర్శకత్వంలో రూపొందిన రుద్రసింహ అనే సినిమా కూడా జూలై 8వ తేదీ విడుదలవుతోంది. ఇక మా నాన్న నక్సలైట్ అంటూ జూలై 8వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు రఘు కుంచే. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్,  ఎల్బీ శ్రీరామ్ రేఖ నిరోషా వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. సత్య వర్మ,  నళినీకాంత్ ప్రధాన పాత్రధారులుగా సిద్ధార్థ శ్రీ  దర్శకత్వంలో రూపొందిన కొండవీడు అనే సినిమా కూడా ఎనిమిదో తేదీ విడుదలవుతోంది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే విద్యుత్ జమ్వాల్ శివలేక ఒబెరాయ్ ప్రధాన పాత్రధారులుగా ఫరూక్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన ఖుదా హఫీజ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక డిజిటల్ వేదికల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ లో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ మోడరన్ లవ్ హైదరాబాద్ జూలై 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అదే రోజు సాస్ బహు ఆచార్,  ప్రైవేట్ లిమిటెడ్ హిందీ సిరీస్ కూడా  జి ఫైవ్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. సోనీ లివ్ లో పకా( రివర్ ఆఫ్ బ్లడ్) అనే మలయాళ మూవీ జూలై 7వ తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే స్పానిష్ నుంచి కంట్రోల్ జి అనే సినిమా జూలై ఆరో తేదీన తెలుగు,  తమిళ,  మలయాళ భాషల్లో జూలై 6వ తేదీన,   అంటే సుందరానికి సినిమా జూలై 10వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక 'ఆహా'లో శివ రాజకుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన జై భజరంగి సినిమా కూడా జులై 8వ తేదీన విడుదల కాబోతోంది.

Also Read: F3 Movie OTT & Collections: F3 సినిమా భారీగా కలెక్షన్లు, ఓటీటీలో విడుదల ఎప్పుుడంటే..?

Also Read: Samantha Insta account Hack: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ఆ నేత ఫోటో షేర్ చేయడంతో వెలుగులోకి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Read More