Home> వినోదం
Advertisement

Malaika Arora: 25 ఏళ్లకే జీవితం ముగియదు.. 40లోనూ ప్రేమను ఆస్వాదించొచ్చు! రూమర్స్‌పై ఘాటు రిప్లై ఇచ్చిన హీరోయిన్

25 ఏళ్లకే జీవితం ముగియదని, 40లోనూ ప్రేమను ఆస్వాదించొచ్చు అని మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్టు పెట్టారు. 

Malaika Arora: 25 ఏళ్లకే జీవితం ముగియదు.. 40లోనూ ప్రేమను ఆస్వాదించొచ్చు! రూమర్స్‌పై ఘాటు రిప్లై ఇచ్చిన హీరోయిన్

Malaika Arora on Break-Up Rumours with Arjun Kapoor: బాలీవుడ్ లవ్‏బర్డ్స్ అర్జున్ కపూర్ (Malaika Arora), మలైకా అరోరా (Arjun Kapoor) పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాల పాటు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అర్జున్-మలైకా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే గత కోద్ది రోజులుగా ఈ జంట విడిపోతున్నారంటూ (Break-Up) సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. తమపై బంధంపై వస్తున్న రూమర్లపై ఇటీవల అర్జున్ కపూర్ స్పందించారు. మలైకతో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ.. తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తాజాగా మలైకా కూడా స్పందించారు. 

25 ఏళ్లకే జీవితం ముగియదని, 40లోనూ ప్రేమను ఆస్వాదించొచ్చు అని మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్టు పెట్టారు. '40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి. మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచడాన్ని అంగీకరించండి. జీవితం 20 ఏళ్లను దాటేసింది. 25 ఏళ్లతో జీవితం ముగియదు. అలా నటించడం మానేద్దాం. ప్రేమను ఎప్పుడైనా ఆస్వాదించొచ్చు' అంటూ మలైకా భావోద్వేగం చెందారు. మలైకా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య వయసు అంతరంపై ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానం ఇచ్చారు. 

Also Read: IND vs SA: లంచ్ బ్రేక్‌ తర్వాత.. కోహ్లీ వ్యూహాలేంటో అంతుపట్టలేదు! మాజీ క్రికెటర్ అసంతృప్తి!!

బ్రేకప్ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ.. మలైకా అరోరాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. 'నీచమైన పుకార్లకు అస్సలు స్థానం లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమిస్తున్నాను' అంటూ రూమర్లకు కౌంటర్ ఇచ్చారు. అర్జున్‌ వయసు 36 కాగా.. మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ముంబై నగరంలో కరోనా కేసులు పెరగడంతో గత కొన్ని ఆరు రోజులుగా మలైకా అరోరా తన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇద్దరు దూరమయ్యారు అని వార్తలు వస్తున్నాయి. 

అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలకు కొన్ని వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. మలైకా అరోరా కూడా వారితో తిరిగినా.. ఆమెకు మాత్రం కరోనా సోకలేదు. కొన్నిరోజులు డిన్నర్, పార్టీలకు దూరంగా ఉండాలని మలైకా నిర్ణయించుకుందట. ఇక అర్జున్ కపూర్ 'ది లేడీ కిల్లర్' (The Lady Killer) అనే చిత్రంలో నటిస్తున్నారు. అజయ్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) కథానాయికగా నటిస్తున్నారు. 

Also Read: Kodi Pandalu: ఢీ అంటే ఢీ అన్న కోడి..ఈసారి పందేలు 450 కోట్ల పైమాటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More