Home> వినోదం
Advertisement

Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..

Lakshya Trailer launched: నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన లక్ష్య మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 10 న లక్ష్య మూవీని రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి రచించి, డైరెక్ట్ చేసిన లక్ష్య మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..

Lakshya Trailer launched: నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన లక్ష్య మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 10 న లక్ష్య మూవీని రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి రచించి, డైరెక్ట్ చేసిన లక్ష్య మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. జగపతి బాబు, సచిన్ కేద్కర్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన లక్ష్య మూవీ నేటి యువతకు స్పూర్తినిస్తుందని లక్ష్య మూవీ యూనిట్ చెబుతోంది. ఇంతకీ లక్ష్య ట్రైలర్‌లో (Lakshya Trailer video) ఏముందో చూద్దాం రండి.

Also read : Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. లక్ష్య మూవీ కోసం నాగ శౌర్య (Naga Shaurya latest news) తనని తాను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నట్టు లక్ష్య మూవీ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సిక్స్ ప్యాక్ బాడీతో, ఆకట్టుకునే ఫిట్‌నెస్‌తో నాగశౌర్య కనిపించనున్నాడు.

Also read : Sirivennela Seetharama sastry: సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు పూర్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More