Home> వినోదం
Advertisement

Adivi Sesh Lady Fan: మొన్న డేటన్నది, ఇప్పుడు డిలీట్ చేయమంటోంది..వారి కంట పడితే అంతే అంటున్న శేష్ ఫ్యాన్!

Adivi Sesh Lady Fan Fear: డేట్ కు ఎప్పుడు వెళదామని హీరో అడివి శేష్ ను అడిగి షాకిచ్చిన లేడీ నెటిజన్ ఇప్పుడు అనూహ్యంగా మీకు దణ్ణం పెడతానురా బాబు డిలీట్ చేయండి అంటోంది, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Adivi Sesh Lady Fan: మొన్న డేటన్నది, ఇప్పుడు డిలీట్ చేయమంటోంది..వారి కంట పడితే అంతే అంటున్న శేష్ ఫ్యాన్!

 Lady Netizen Asked Date with Adivi Sesh: హీరో అడవి శేష్ కి ముందు నుంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. క్యూట్ గా కనిపించడం, అలాగే ఆరడుగుల ఎత్తుగా ఉంటాడు కాబట్టి ఈయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. తాజాగా ఆయన హీరోగా నటించిన హిట్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఒక రకంగా ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టు అయింది.

అయితే ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్క అడవి శేష్ కి మాత్రం ఇలా వరుసగా 6 సినిమాలు హిట్ అయ్యాయి. ఈ దెబ్బతో ఆయన మీద ఆయన లేడీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హిట్ 2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అడవి శేష్ ట్విట్టర్లో ఒక ఆస్క్ మీ సెషన్ నిర్వహించాడు, తన ఫాలోవర్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మనం ఎప్పుడు డేట్ కి వెళదాం అంటూ ఒక లేడీ నెటిజెన్ ప్రశ్నించడంతో వెంటనే అడవి శేష్ కూడా ఇప్పుడే వచ్చేస్తున్నా ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామని ఆన్సర్ ఇచ్చాడు.

దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయినట్లయింది. ఇదే విషయాన్ని పలు వెబ్సైట్స్ సహా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హైలెట్ చేయడంతో ఆ అమ్మాయి షాక్ అయింది. వెంటనే వాటిలో కొన్నింటిని ట్యాగ్ చేస్తూ నేను ఇంకెప్పుడూ సెలబ్రిటీలను ఇలాంటి ట్విట్టర్లో కామెంట్ చేయను అంటూ పేర్కొనడమే కాక ఒక వెబ్సైట్ ట్వీట్ టాగ్ చేస్తూ ఒరేయ్ డిలీట్ చేయరా నీకు దండం పెడతా, మా అమ్మ బాబులు చూస్తే నాకు అయిపోయినట్టే అంటూ ట్వీట్ చేసింది.

ఇక ఆమె ట్వీట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆధార్ నెంబర్ కూడా ప్రింట్ చేయాల్సింది అని ఒకరు సెటైర్ వేస్తె మరో అమ్మాయి మాత్రం నాకు ఆ ఫీలింగ్ తెలుసు, వాళ్ళు చూడకూడదని కోరుకుంటున్నాను అంటూ సదరు లేడీ నెటిజన్  తల్లిదండ్రుల గురించి కామెంట్ చేసింది.  

ఇక అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమాని నాని నిర్మాతగా రూపొందించారు .శైలేష్ కొలను ఈ సినిమాకి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా కోమలి ప్రసాద్, రమణ నీల, హర్షవర్ధన్, సుహాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Also Read: Jabardasth Satya Sri : నా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయ్.. జబర్దస్త్ సత్య ఎమోషనల్

Also Read: #NTRforSDT : మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న జూ.ఎన్టీఆర్.. ఆయన కోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

 
 
Read More