Home> వినోదం
Advertisement

Samantha Ruth Prabhu: ఛాన్స్ వస్తే ఒంటరిగా బతికేయండి.. సమంత పోస్ట్ అర్థం అదేనా..?

Samantha Instagram Story: సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సేదా తీరుతున్నారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడికి వెళ్లానంటూ ఇటీవలె చెప్పారు. తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. జీవిత తత్వం బోధించారు.
 

Samantha Ruth Prabhu: ఛాన్స్ వస్తే ఒంటరిగా బతికేయండి.. సమంత పోస్ట్ అర్థం అదేనా..?

Samantha Instagram Story: విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. విజయ్-సామ్ కెమెస్ట్రీని తెరపై చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా.. సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఉన్నారు. అక్కడ ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో పాల్గొంటూ.. న్యూయార్క్ వీధుల్లో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తన మొదటి సినిమా షూటింగ్ సందర్భంగా న్యూయార్క్ వచ్చానని.. మళ్లీ 14 ఏళ్ల తరువాత అదే ప్రదేశానికి వచ్చానంటూ రీసెంట్‌గా సామ్ చెప్పిన విషయం తెలిసిందే.

సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. "మీకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లే అవకాశం వచ్చినా.. నడిచే అవకాశం వచ్చినా.. ప్రయాణించే అవకాశం వచ్చినా.. బతికే అవకాశం వచ్చినా.. డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా చేసేయండి. ఈ సమాజం నిన్ను నిన్నులా ఒప్పుకోకపోతే.. అలా ఒంటరిగా ప్రయాణించు.. నిన్ను నువ్వు అన్వేషించుకో.. పక్కన ఎవరైనా ఉన్నప్పుడే తన గురించి తాను తెలుసుకుంటారు.. కానీ మీరు కూడా ఆ కేటగిరీలో ఉండకండి.. కానీ మీకు ఒంటరిగా నడిచే, బతికే అవకాశం వస్తే మాత్రం బతికేయండి.. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది.. తెలుస్తుంది.." అంటూ సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 

ఖుషి మూవీ మరో వారంలో రిలీజ్ అవుతుందనగా.. సామ్ ఇంకా ప్రమోషన్స్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మ్యూజిక్ కన్సెర్ట్‌లో పాల్గొన్న సమంత.. విజయ్ దేవరకొండతో స్టేజీపై డ్యాన్స్‌తో అలరించారు. ఆ తరువాత న్యూయార్క్ ట్రిప్‌కు వెళ్లిపోయారు. ఇప్పట్లో భారత్‌కు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో సమంత ప్రమోషన్స్‌కు దూరం అవుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత ఏడాదిపాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Also Read: Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం  

Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More