Home> వినోదం
Advertisement

Kumari Aunty Movies: కుమారి ఆంటీ సంచలనం.. రెండు సినిమాలు తిరస్కరణ

Kumari Aunty Rejects Movie Offers: తన ఆహారంతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వస్తున్న స్టార్‌డమ్‌ ద్వారా రెండు సినిమా అవకాశాలు వస్తే ఆమె తిరస్కరించడం వైరల్‌గా మారింది.

Kumari Aunty Movies: కుమారి ఆంటీ సంచలనం.. రెండు సినిమాలు తిరస్కరణ

Kumari Aunty: రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ ఇప్పుడు బుల్లితెరపై మెరిశారు. టీవీ షోస్‌లో కనిపించి ప్రత్యేకత చాటారు. ఆమె రోజురోజుకు క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు రెండు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిసింది. ఎవరైనా అయితే ఎగిరి గంతులు వేస్తారు. కానీ కుమారి ఆంటీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు అందివచ్చిన అద్భుత అవకాశాన్ని వదులుకున్నారు. సినిమా అవకాశాలను కుమారి ఆంటీ తిరస్కరించారు. ఈ విషయాన్ని కుమారి ఆంటీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Also Read: Karthika Deepam: సినిమా రేంజ్‌లో కార్తీక దీపం.. చరిత్రలోనే తొలిసారి సీరియల్‌కు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

 

ఇటీవల సీరియల్స్‌లో మెరిసిన కుమారి ఆంటీని తాజాగా ఓ న్యూస్‌ చానల్‌ ఇంటర్వ్యూ చేసింది. రేవంత్‌ రెడ్డి స్పందించిన అనంతరం ఆమె వ్యాపారం ఎలా ఉందని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికితోడు సీరియల్స్‌లో అవకాశం, సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా అని అడిగారు. వీటికి సమాధానం ఇస్తూ కుమారి ఆంటీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'కొందరు చానల్స్‌ వాళ్లు వచ్చి అడిగారు. ఇక మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్‌లో చేశాను. అంతకుముందే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నా. ఇంద్రజ, ఆది తదితరులతో కలిసి నటించా. నటించేప్పుడు కొంత ఇబ్బంది పడ్డా' అని తెలిపారు. అయితే సీరియల్స్‌లో నటించినందుకు ఏమైనా డబ్బు ఇచ్చారా? అని అడగ్గా 'ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయితే అక్కడకు తీసుకెళ్లిన ఆహారానికి మాత్రం డబ్బులు ఇచ్చారు' అని కుమారి ఆంటీ తెలిపారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ కొత్త కారు.. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అప్లై.. ఇంతకీ దేనికోసం?

 

'సీరియల్స్‌లో అడిగారు కానీ నా వ్యాపారం వలన కుదరడం లేదు. నాకు సమయం దొరకడం లేదు. ఆ సీరియల్‌, షోలో నా వ్యాపారం అయిపోయిన తర్వాత వెళ్లాను. అంటే మధ్యాహ్నం 3 తర్వాత వాటికి వెళ్లాను. ఇక ఒక రోజు సీరియల్‌ షూటింగ్‌ కోసం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు వెళ్లాను' అని కుమారి ఆంటీ వివరించారు. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా? అని అడగ్గా 'సినిమాలా? వచ్చాయి నాన్న. రెండు సినిమాల వాళ్లు అడిగారు. అయితే నా వ్యాపారం వలన కుదరదని చెప్పా. నేను చేయాలనని వారికి చెప్పా. ఎందుకంటే కొన్ని రోజులపాటు సినిమాల్లో నటించాలని చెప్పారు. నాకు జీవితం ఇచ్చిన ఫుడ్‌ కోర్టును వదులుకోను. వ్యాపారం చేసుకుంటూనే సీరియల్స్‌ మాదిరి ఖాళీ సమయంలో చేస్తానని చెప్పా. అయితే సమయం కుదరక ఆ సినిమాలు వదులుకున్నా' అని వెల్లడించారు. 

అవకాశం వచ్చిన సినిమాలు ఏమిటి? హీరో ఎవరు? అనే విషయాలపై మాత్రం కుమారి ఆంటీ నోరు విప్పలేదు. 'అవన్నీ నా కొడుకు చూసుకుంటున్నాడు. సీరియల్స్‌, షోస్‌ వంటివి మా అబ్బాయికి తెలుసు' అని వివరించారు. సినిమాల్లో నటించకపోయినా అగ్ర హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ తదితర హీరోలను కలవాలనే తన కోరికను కుమారి ఆంటీ వెలిబుచ్చారు. అయితే వారితో సినిమా అవకాశాలు వస్తే చేస్తారా అని అడగ్గా కొంత సంశయం వ్యక్తం చేశారు. ఆమె హావభావాలు చూస్తే అగ్ర హీరోల సినిమా అవకాశాలు వస్తే మాత్రం కుమారి ఆంటీ చేసేందుకు సిద్ధమని తెలుస్తోంది.

ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కేబుల్‌ బ్రిడ్జీ సమీపంలో 2011 నుంచి ఫుడ్‌ స్టాల్‌ నిర్వహిస్తున్నారు. ఇంట్లో చేసినట్టు రుచికరంగా.. శుచిగా ఉంటుండడంతో ఆమె ఆహారం కోసం ప్రజలు ఎదురుచూసేవారు. ఈ సందర్భంగా కొన్ని యూట్యూబ్‌ చానళ్ల ద్వారా కుమారి ఆంటీ ఫేమస్‌ అయ్యారు. గతేడాది ట్రాఫిక్‌ పోలీస్‌ డబ్బా తొలగించడం, రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించడంతో కుమారి ఆంటీ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇటీవల జీ తెలుగులో 'రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌' అనే సీరియల్‌లో, ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'తోపాటు మరొక షోలో కనిపించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More