Home> వినోదం
Advertisement

Tollywood: ఆ ఇద్దరు హీరోయిన్ల గురించే దర్శక, నిర్మాతల చర్చలు

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడంతా హీరోయిన్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కొత్త హీరోయిన్ల విషయంలో చర్చ సాగుతోంది. దర్శక, నిర్మాతల దృష్టి అంతా ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్ల మీదే ఉందట..
 

Tollywood: ఆ ఇద్దరు హీరోయిన్ల గురించే దర్శక, నిర్మాతల చర్చలు

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడంతా హీరోయిన్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కొత్త హీరోయిన్ల విషయంలో చర్చ సాగుతోంది. దర్శక, నిర్మాతల దృష్టి అంతా ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్ల మీదే ఉందట..

తెలుగు సినీ పరిశ్రమ(Tollywood) లో ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. కొత్తగా వచ్చే హీరోయిన్ల సినిమాలు సూపర్ హిట్ కావడం ఓ వైపు..మరోవైపు అందం , అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో క్రేజ్ పెరుగుతోంది. అటువంటివారిలో ముందుగా చెప్పాల్సిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన సినిమా (Uppena Movie) సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా కృతిశెట్టి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా కృతిశెట్టి అందం, అభినయం, హావాభావాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయని చెప్పవచ్చు. అటు పూరీ జగన్నాథ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కేతిక శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. క్రేజ్ ఉంది. 

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంది. గత ఏడాది పూజా హెగ్డే, రష్మిక మధ్య ఉన్న పోటీ ఇప్పుడు మారింది. ఇటు కృతిశెట్టి(Kritishetty) చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అటు కేతిక శర్మ చేతిలో కూడా రెండు మూడు సినిమాలున్నాయి. కేతిక (Ketika Sharma)ప్రస్తుతం నాగశౌర్యతో నటిస్తూనే..వైష్ణవ్ తేజ్‌తో ఛాన్స్ కొట్టింది. దర్శక, నిర్మాతలు కూడా ఈ ఇద్దరి గురించే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. 

Also read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్‌లో చికిత్స

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More