Home> వినోదం
Advertisement

Krishnam Raju new poster: రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే... రాధేశ్యామ్ నుంచి 'పరమహంస' పోస్టర్ రిలీజ్

Krishnam Raju Birthday: ఇవాళ రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు కానుకగా రాధేశ్యామ్ టీం సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆయన బర్త్ డే విషెస్ తెలుపుతూ...పోస్టర్ ను రిలీజ్ చేసింది. 
 

Krishnam Raju new poster: రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే... రాధేశ్యామ్ నుంచి 'పరమహంస' పోస్టర్ రిలీజ్

Krishnam Raju new poster from Radhe shyam movie: నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే (Krishnam Raju Birthday). ఈ సందర్భంగా రాధేశ్యామ్ మూవీ నుంచి ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ''పరమహంస గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండాలి'' అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. 

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్‌ (RadheShyam). రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా (Covid-19) కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త విడుద‌ల తేదీపై చిత్ర యూనిట్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయలేదు. తాజాగా కొత్త  రిలీజ్‌ డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతుంది. మార్చి 18న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

Also Read: Vishal Saamanyudu Trailer: 'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్.. డైలాగ్స్‌, యాక్షన్ తో అదరగొట్టిన విశాల్..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Read More