Home> వినోదం
Advertisement

Mark Antony Review: విశాల్​ 'మార్క్ ఆంటోనీ' హిట్టా? పట్టా?

Mark Antony: విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. దీంతో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ రెస్పాన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?
 

Mark Antony Review: విశాల్​ 'మార్క్ ఆంటోనీ' హిట్టా? పట్టా?

Mark Antony Twitter Review: కోలీవుడ్ స్టార్స్ విశాల్- ఎస్​జే సూర్య లీడ్ రోల్స్ చేసిన మూవీ 'మార్క్ ఆంటోని'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. రీతూవర్మ, అభినయ, సునీల్, రీతూ వర్మ, వై.జి. మహేంద్రన్, సెల్వరాఘవన్ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ పడ్డాయి. అవి చూసిన ఆడియెన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.

మూవీ ఎలా ఉందంటే?

'మార్క్ ఆంటోని' సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండ్ హాఫ్ వీర లెవల్ అని కొందరు నెటిజన్స్ పేర్కొన్నారు. ఎస్ జే సూర్య యాక్టింగ్ అదిరిపోయిందని మరొకరు రాసుకొచ్చారు. ఈ మూవీకి మ్యూజిక్ హైలెట్ అని ఒకరు.. యాక్షన్ సీన్స్ బాగున్నాయని మరొకరు ట్వీట్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అదిరిపోయిందని ఇంకొంకరు ట్వీట్ చేశారు. 

ఈ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. పీటర్ హెయిన్స్, కనల్ కణ్ణన్, దిలీప్ సుబ్బరాయన్, దినేశ్ సుబ్బరాయన్లు తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటర్ గా విజయ్ వేలుకుట్టి వ్యవహారించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు  అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. 

Also Read: Salaar Digital Rights: ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్.. విడుదలకు ముందే సలార్ రికార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More