Home> వినోదం
Advertisement

Kiara Advani Wedding Postponed : వాయిదా పడ్డ కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి.. కారణం ఏంటంటే?

Kiara Advani Wedding Postponed : వాయిదా పడ్డ కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి.. కారణం ఏంటంటే?

Kiara Advani Wedding Postponed బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోంది. కియారా అద్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రలు నేడు వివాహా బంధంతో ఒక్కటి కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ముహుర్తం మారినట్టు సమాచారం. నేడు జరగాల్సిన పెళ్లిని రేపటికి వాయిదా వేశారట. ఫిబ్రవరి 7న కియారా, సిద్దార్థ్‌ల పెళ్లి జరగనుందట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ పెళ్లిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

కియారా సిద్దార్థ్ పెళ్లికి సంబంధించిన వార్తలు గత వారం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. నాలుగో తేదీ నుంచి ఈ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్ననే ఇరు కుటుంబ సభ్యులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు రాజస్థాన్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు వద్ద కియారా, సిద్దార్థ్ కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

మెహెందీ వేడుకుల కూడా జరిగాయి. నైట్ సంగీత్ పార్టీ కూడా ఘనంగానే జరిగినట్టుంది. ఇందులో కియారా, సిద్దార్థ్ బాగానే స్టెప్పులు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ముహూర్తం మారినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్క రోజు ఈ పెళ్లిని వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతోంది.

ఈ రోజు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకుంటారట. రేపు పెళ్లి చేసుకుంటారట. ఈ వారాంతంలో బాలీవుడ్ సెలెబ్రిటీలకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నారట. ఇక ఈ పెళ్లికి రామ్ చరణ్‌ కూడా రాజస్థాన్‌లో దిగాడని తెలుస్తోంది. మరి ఈ పెళ్లికి మన తెలుగు నుంచి ఎవరెవరు వెళ్లారా? అన్నది ఇంకా పూర్తిగా తెలియడం లేదు. 

కియారాతో ప్రస్తుతం రామ్ చరణ్‌ rc 15 సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వినయ విధేయ రామా సినిమాతో రామ్ చరణ్‌తో స్టెప్పులు వేసింది.

Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More