Home> వినోదం
Advertisement

Kiara- Sidharth: బ్రేకప్‌ చెప్పేసుకున్న మరో బాలీవుడ్ జంట!

Kiara Advani- Sidharth Malhotra: బాలీవుడ్‌లో మరో క్యూట్ కపుల్ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. సిద్దార్థ్ మల్హ్రోత్రా-కియారా అద్వానీ విడిపోయారన్న వార్తలు నెట్టింట జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి. 
 

Kiara- Sidharth: బ్రేకప్‌ చెప్పేసుకున్న మరో బాలీవుడ్ జంట!

Kiara Advani- Sidharth Malhotra: బాలీవుడ్‌లో మరో బ్యూటీఫుల్‌ కపుల్‌ బ్రేకప్ చెప్పేసుకున్నారట. హీరో సిద్దార్థ్ మల్హ్రోత్రా (Sidharth Malhotra)-కియారా అద్వానీ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కెర్లు కొట్టాయి. కానీ సడెన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ వీరు తమ రిలేషన్‌కి ఎండ్‌ కార్డ్‌ వేసినట్లు బీటౌన్ (bollywood) వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కియార్ (Kiara Advani) బ్రేకప్ వార్తలు నిజమేనంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీరిద్ధరి బ్రేకప్ వ్యవహారం బీటౌన్ లో హాట్  టాపిక్ గా మారింది. 

షేర్షా సినిమాలో (shershaah Movie) వీరిద్ధరూ కలిసి నటించారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా తర్వాత  ఈ జంట పార్టీలు, వెకేషన్స్‌ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత వివాహం చేసుకునే కపుల్‌ వీళ్లేనంటూ బీటౌన్‌లో టాక్ నడిచింది. కానీ అందరికి షాక్‌ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కియారా భూల్ భూలయ్యా 2 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇటీవలె లైగర్‌ బ్యూటీ అనన్య.. ప్రియుడు ఇషాన్‌ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతుంటే.. మరోవైపు బ్రేకప్ వార్తలు తెగ హల్ చల్  చేస్తున్నాయి. 

Also Read: Malaika Arora Dating: నేను విడాకులు తీసుకున్నా.. కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి! హీరోయిన్ ఘాటు రిప్లై 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More