Home> వినోదం
Advertisement

KGF Chapter 2 Teaser: కేక పుట్టిస్తున్న కేజీఎఫ్ 2 మూవీ టీజర్

కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది.

KGF Chapter 2 Teaser: కేక పుట్టిస్తున్న కేజీఎఫ్ 2 మూవీ టీజర్

కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది. యష్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ మూవీ కమర్షియల్ మూవీ మేకింగ్‌లో కొత్త పంథాను చాటుకుంది. లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ లాంటి అనుభూతిని ఇచ్చే చిత్రాల్లో ఒకటిగా నిలిచిన కేజీఎఫ్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ముందుగానే కేజీఎఫ్ 2 టీజర్ అకస్మాత్తుగా గురువారం రాత్రి యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. శుక్రవారం జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల కావాల్సి ఉండగా.. చిత్ర నిర్మాతలు అభిమానుల కోసం ఇవాళే ఈ టీజర్‌ను విడుదల చేశారు.

యశ్, ప్రశాంత్ నీల్ అంచనాలకు అనుగుణంగా కేజీఎఫ్ 2 టీజర్ ఉంది. అద్భుతమైన విజువల్స్, ఉత్తేజకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మెషిన్ గన్‌పై కాల్పులు వంటి సీన్స్ చూస్తే.. కేజీఎఫ్ 2 మూవీ కచ్చితంగా పైసా వాసూల్‌ సినిమానే అనుకునేలా చేశాయి.

Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌ రిలీజ్ డేట్ ఖరారు 

హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీలో సంజయ్ దత్ ( Sanjay Dutt ) విలన్ షేడ్స్ ఉన్న అధిరా పాత్రలో నటించగా శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, మాల్వికా అవినాష్, అచ్యుత్ కుమార్, అయ్యప్ప పి. శర్మ, రావు రమేష్, ఈశ్వరి రావు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

కేజీఎఫ్ 2 మూవీ టీజరే ( KGF teaser 2 ) ఇలా కేకపుట్టించేలా ఉంటే... కేజీఎఫ్ 2 ట్రైలర్ ( KGF 2 trailer ) ఎలా ఉంటుందోనని యశ్, ప్రశాంత్ నీల్ అభిమానులు అనుకుంటున్నారు.

Also read : Master Telugu movie: విడుదలకు ముందే మాస్టర్ దూకుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More