Home> వినోదం
Advertisement

KGF 2 Release Date: ఆ డేట్‌కే వస్తోన్న కేజీఎఫ్‌ 2, సమ్మర్ బరిలో యశ్ మూవీ

KGF Chapter 2 Release Date: కేజీఎఫ్‌ చాప్టర్ 2 మూవీకి సంబంధించి గతంలో ప్రకటించిన రిలీజ్‌ డేట్‌కే... సినిమాను రిలీజ్‌ చేయాలని ఫిక్స్ అయింది మూవీ యూనిట్.. యశ్ మూవీ సమ్మర్ బరిలో నిలవనుంది.

KGF 2 Release Date: ఆ డేట్‌కే వస్తోన్న కేజీఎఫ్‌ 2, సమ్మర్ బరిలో యశ్ మూవీ

KGF Chapter 2: కేజీఎఫ్‌ మూవీ సృష్టించిన రికార్డ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా రికార్డ్‌లు బద్దలు కొట్టింది. ఈ మూవీతోనే కన్నడ హీరో యశ్‌ తనకంటూ ఒక ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు.

కేజీఎఫ్‌ (KGF) మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న కేజీఎఫ్‌ చాప్టర్ 2పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పాన్‌ ఇండియా (Pan India Movie) లెవెల్‌లో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. 

కేజీఎఫ్‌ చాప్టర్ 2 (KGF Chapter 2) సినిమాను ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు కూడా అదే డేట్‌కే కేజీఎఫ్‌ చాప్టర్ 2 మూవీ రిలీజ్‌ చేయాలని మూవీ యూనిట్ ఫిక్స్‌ అయింది. 

ఇక తాజాగా హీరో యశ్‌, డైరెక్టర్‌‌ ప్రశాంత్ నీల్‌తో పాటు మూవీ యూనిట్‌లోని కొందరు కర్ణాటకలో కొల్లూర్, ఉడిపిలో ఉండే మూకాంబికా అమ్మవారిని, అనెగుడ్డే వినాయకుడి ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఏప్రిల్‌ 14నే సినిమాను రిలీజ్ (Release) చేస్తామని మూవీ (Movie) యూనిట్ పేర్కొంది. మొత్తానికి సమ్మర్‌‌ బరిలో కేజీఎఫ్‌ చాప్టర్ 2 మూవీ నిలవనుంది. ఇక కేజీఎఫ్‌2 నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌ ఈ మూవీని నిర్మిస్తోంది. 

Also Read: KTR on Budget: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదు..

Also Read: Covid 19 Cases in India: నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More