Home> వినోదం
Advertisement

KGF 2 Collections: హిందీలో దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2'.. సల్మాన్, అమీర్ రికార్డులను బద్దలుగొట్టిన రాకీబాయ్..!

KGF 2 collections: యశ్ (Yash) నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.  హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. 
 

KGF 2 Collections: హిందీలో దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2'.. సల్మాన్, అమీర్ రికార్డులను బద్దలుగొట్టిన రాకీబాయ్..!

KGF 2 Box office collections: దేశవ్యాప్తంగా KGF 2 ప్రభంజనం కొనసాగుతోంది. అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. ఈ సినిమా దూసుకుపోతుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా 'కేజీఎఫ్ 2' (KGF 2 Movie) నిలిచింది. ఇంతకుముందు టైగర్ జిందా హై, పీకే, సంజు చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. KGF 2 శుక్రవారం రూ. 11.56 కోట్లు, శనివారం రూ. 18.25 కోట్లు, ఆదివారం రూ. 22.68 కోట్లు, సోమవారం రూ. 8.28 కోట్లు, మంగళవారం రూ. 7.48 కోట్లు, బుధవారం రూ. 6.25 కోట్లు. అంటే హిందీ వెర్షన్ మెుత్తం రూ. 343.13కోట్లు వసూళ్లు (KGF 2 collections) వచ్చాయి.

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) తెలిపిన వివరాల ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లు, రెండు రోజుల్లో 100 కోట్లు, నాలుగో రోజు 150 కోట్లు, ఐదు రోజుల్లో 200 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ 2 ఆరో రోజుకు రూ.225 కోట్లు,  తొమ్మిదో రోజుకు రూ. 275 కోట్లు రాబ్టటింది. 11 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ సెంచరీని సాధించింది. 2019 సంవత్సరం తర్వాత 300 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా KGF 2. ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 540 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, కేజీఎఫ్ 2 వసూళ్ల సునామీ పదిహేనవ రోజు కూడా కొనసాగుతుంది. ఈ సినిమా 15వ రోజు 10 కోట్లు రాబట్టింది. మరోవైపు ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకు 684.71 కోట్లు సాధించింది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, విజయ్ కిరుగందూర్ నిర్మించారు. ఈ చిత్రంలో యష్, సంజయ్ దత్ (Sanjay Dutt), రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, బాలకృష్ణ, అనంత్ నాగ్, మాళవిక అవినాష్, శరణ్ శక్తి, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. KGF మూడవ భాగం కూడా ఉండవచ్చని నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

Also Read: Sudeep vs Ajay Devgn: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోల మధ్య ట్విట్టర్ వార్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More