Home> వినోదం
Advertisement

KFG Chapter 2: షూటింగ్ కోసం సిద్ధం అవుతున్న యష్

యష్ ( KGF Yash ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF Chapter 1) చిత్రం జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ సినీ పరిశ్రమకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

KFG Chapter 2: షూటింగ్ కోసం సిద్ధం అవుతున్న యష్

యష్ ( KGF Yash ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF Chapter 1) చిత్రం జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ సినీ పరిశ్రమకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా సంబంధించిన వసూళ్లు, విజయాన్ని గమనించిన దర్శక నిర్మాతలు కేజీఎప్ చాప్టర్ 2 ( KFG Chapter 2 ) ని మరింత భారీ బడ్జెట్ తో, జాతీయ స్థాయి నటులతో తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనావైరస్ (  Coronavirus ) వల్ల ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయాలి అనుకున్న సినిమా వాయిదా పడింది. కేవలం 15 శాతం షూటింగ్ మిగిలి ఉంది అని దర్శకుడు ప్రశాంత్ నీల్  తెలిపాడు. అది కూడా త్వరలో ప్రారంభిస్తాం అన్నాడు.

Read This Story : Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మిగిలిన షూటింగ్ ను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారట. దీని కోసం యష్ అండ్ ప్రశాంత్ నీల్ ( Prashant Neel ) తమ టీమ్ ను సిద్ధం చేస్తున్నారట. కొన్ని కీలక సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని.. అందులో కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీలో ( KGF In Ramoji Film City ) షూట్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ లైన్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ బావిస్తోందని సమాచారం. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ ( Sanjay Dutt In KGF ), రవీనా టాండన్ ( Raveena Tandon In KGF ) నటిస్తున్న విషయం తెలిసిందే.

Read This Story: Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి

Read More