Home> వినోదం
Advertisement

Keerthy Suresh: ఫ్యాన్స్‌కి అప్పటివరకు వెయిటింగ్ తప్పదు

మహానటి సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ).. ఆ సినిమాతో అమాంతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

Keerthy Suresh: ఫ్యాన్స్‌కి అప్పటివరకు వెయిటింగ్ తప్పదు

మహానటి సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ).. ఆ సినిమాతో అమాంతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ అప్‌కమింగ్ మూవీ 'గుడ్ లక్ సఖి' ( Good luck Sakhi ) ఎప్పుడెప్పుడు ఆడియెన్స్ ముందుకు వస్తుందా అని ఆమె అభిమానులు వేచిచూస్తున్నారు. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ లక్ సఖి మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళ భాషలలో తెరకెక్కుతోంది. Also read : నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో గ్యాలరీ

గుడ్ లక్ సఖి మూవీ టీజర్‌ను ( Good luck Sakhi teaser ) ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్‌లో కీర్తి సురేష్ ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో షూటర్‌గా ( Shooter ) కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తుండగా, వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌లో సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ( Adi Pinishetty), జగపతి బాబు ( Jagapathi Babu ) ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Also read : Sanjay Dutt: సంజయ్ దత్ గురించి వర్రీ అవుతున్న చిరంజీవి

Read More