Home> వినోదం
Advertisement

Good Luck Sakhi Release Date: ఎట్టకేలకు థియేటర్లలో రిలీజుకు సిద్ధమైన 'గుడ్ లక్ సఖి'

Good Luck Sakhi Release Date: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన 'గుడ్​లక్ సఖి' (Good Luck Sakhi).. దాదాపు ఏడాది నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. తాజాగా సినిమా విడుదలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. నవంబరు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'గుడ్​లక్ సఖి' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Good Luck Sakhi Release Date: ఎట్టకేలకు థియేటర్లలో రిలీజుకు సిద్ధమైన 'గుడ్ లక్ సఖి'

Good Luck Sakhi Release Date: స్టార్​ హీరోయిన్​ కీర్తి సురేష్ (Keerthy Suresh News)​, ఆది పినిశెట్టి (Aadhi Pinisetty News) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్​లక్​ సఖి'. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల చేసేందుకు కొత్త తేదీని ప్రకటించింది చిత్రబృందం. నవంబరు 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

గన్ షూటింగ్ పోటీల నేపథ్య కథతో తీసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్​ పక్కా పల్లెటూరి యువతిగా కనిపించనుంది. నగేష్ కూకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుధీర్​ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పిస్తున్నారు.

గతేడాది ఏప్రిల్​లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే జూన్​ 3న థియేటర్లలో విడుదల చేస్తామని మార్చిలో చిత్రబృందం ప్రకటించింది. కానీ, ఆ రోజున సినిమాను విడుదల చేసేందుకు వీలు కుదరలేదు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ, నిర్మాతల అభీష్టం మేరకు సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలిపారు. అదే నిర్ణయంతో ఇప్పుడు 'గుడ్​లక్ సఖి' సినిమాకు మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

అయితే కీర్తి సురేశ్ నుంచి గతేడాది ఓటీటీలో రిలీజ్​ అయిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలు (Keerthy Suresh New Movies).. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చాయి. అందుకే ‘గుడ్​లక్ సఖి’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా (Sarkaru Vaari Paata Release Date) విడుదల కానుంది. 

Also Read:  Deepavali Release Movies: దీపావళికి థియేటర్లలో ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే  

Also Read: Suriya Donation For Irular Tribe: ఆదివాసీల సంక్షేమానికి ముందుకొచ్చి హీరో సూర్య దంపతులు.. రూ.కోటి విరాళం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More