Home> వినోదం
Advertisement

Keerthy Suresh Marriage : పెళ్లి గురించి అడిగిన నెటిజన్.. కీర్తి సురేష్ సమాధానం ఇదే.. దాని ఉద్దేశం ఏంటి?

Keerthy Suresh Marriage కీర్తి సురేష్‌ తాజాగా పెళ్లి గురించి స్పందించింది. తన పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌కు వింతగా సమాధానం ఇచ్చింది. లుంగీ ఎత్తి కట్టి.. జేబులు ఖాళీగా ఉన్నాయంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది. అయితే దీని అర్థం ఏంటన్నది మాత్రం అర్థం కావడం లేదు.

Keerthy Suresh Marriage : పెళ్లి గురించి అడిగిన నెటిజన్.. కీర్తి సురేష్ సమాధానం ఇదే.. దాని ఉద్దేశం ఏంటి?

Keerthy Suresh Marriage News మహానటి కీర్తి సురేష్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వెన్నెల పాత్రను కీర్తి సురేష్‌ పోషించిన తీరు, ఈ సినిమాతో వేసిన డ్యాన్స్ ఇలా అన్నీ కూడా అందరినీ మెప్పించాయి. మహానటి సినిమా తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాతో కూడా అవార్డులు వస్తాయేమో అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు దసరా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్‌, నాని కాంబోలో హ్యాట్రిక్ సినిమా కావాలని కోరుతున్నారు. నేను లోకల్, దసరా సినిమాలు బ్లాక్ బస్టర్‌ హిట్లు అయిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంబోలో మూడో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే తాజాగా కీర్తి సురేష్‌ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఇందులో కీర్తి సురేష్‌ను రకరకాల ప్రశ్నలు వేశారు. వాటికి కీర్తి సురేష్‌ ఎంతో శాంతంగా సమాధానాలు ఇచ్చింది.

fallbacks

దసరా సినిమాలో నాలుగు పళ్లు కనిపించేలా కీర్తి సురేష్‌ నవ్వుతుంది. ఫోర్ టీత్ స్మైల్ చాలెంజ్ అంటూ ఓ నెటిజన్ మళ్లీ అలానే నవ్వమని అడిగాడు. అలా వెన్నెల నవ్వుతుంది.. ఇప్పుడు కష్టమని చెబుతూ.. నవ్వేందుకు కష్టపడింది కీర్తి సురేష్. కానీ అలా నవ్వలేకపోయింది. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిన్ను అని పిలవడం, సంబోధించడం మీద ఓ నెటిజన్ అడిగాడు. అలా ఏకవచనంతో పిలిస్తే మీరు హర్ట్ అవ్వలేదా? అన్నట్టుగా అడిగాడు.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

కొన్ని చోట్ల నువ్వు అంటే అగౌరవపర్చినట్టుగా కాదు..అది ప్రేమతోనే అన్నట్టు.. నేను మా అమ్మని కూడా నువ్వు అని పిలుస్తాను కదా?.. శ్రీకాంత్ ప్రేమతోనే అలా పిలిచాడు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. మరో నెటిజన్ నీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దానికి జిఫ్ ఫైల్‌ను షేర్ చేసింది. అందులో లుంగీ ఎత్తినట్టు, జేబులు ఖాళీగా ఉన్నాయన్నట్టుగా చూపించింది. జేబులు ఖాళీగా ఉన్నాయ్.. ఇంకా బాగా సంపాదించిన తరువాత పెళ్లి చేసుకుంటాను అని పరోక్షంగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆ మధ్య మాత్రం కీర్తి సురేష్ అనిరుధ్ రవిచంద్రన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి అంటూ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More