Home> వినోదం
Advertisement

Kashmir files: కశ్మీర్ ఫైల్స్ మూవీ డైరెక్టర్​కు Y క్యాటగిరీ భద్రత- కారణాలివే..

Kashmir files: బాలీవుడ్ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రికి భద్రత పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇటీవల ఆయన తీసిన కశ్మీర్​ ఫైల్స్​ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా.. వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు Y సెక్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.​

Kashmir files: కశ్మీర్ ఫైల్స్ మూవీ డైరెక్టర్​కు Y క్యాటగిరీ భద్రత- కారణాలివే..

Kashmir files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా 'కశ్మీర్ ఫైల్స్'. ఎన్నో వివాదాల నడుమ విడదలై.. థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా రికార్డుల చుట్టూ వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఊ మూవీ డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రికి భద్రత పెంచింది కేద్రం. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో సీఆర్​పీఎఫ్​ సిబ్బందితో కూడిన 'వై' క్యాటగిరి భద్రతను కల్పించాలని నిర్ఱయించింది.

పెద్ద పెద్ద నాయకుల ప్రశంసలు..

 చిన్న సినిమా అయినా.. ఇప్పుడు రికార్డు వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హో మంత్రి అమిత్​ షా సహా పెద్ద పెప్ద నాయకులు సైతం ఈ సినిమాను పొగిడేస్తుండటం విశేషం.

కశ్మీర్​ లోయలో హిందూ పండిట్​లపై జరిగిన అకృత్యాలను కల్లకు కట్టినట్లు చూపించారంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు.

అయితే ఈ సినిమాకు ఆది నుంచే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఈ సినిమా వల్ల హిందూ, ముస్లీం మధ్య విద్వేశాలు రెచ్చగొడతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మూవీ డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రికి భద్రతను పెంచింది ప్రభుత్వం.

Also read: స్టార్స్ హీరోలు మా సినిమాల్లో నటించడానికి ఇష్టపడరు.. మహేష్ బాబు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!

Also read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More