Home> వినోదం
Advertisement

Kareena Kapoor: శృంగారంపై స్టార్ ప్రోడ్యూసర్‌ ప్రశ్న.. దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన కరీనా కపూర్‌!

Kareena Kapoor punch to Karan Johar in Koffee with Karan Show. బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రాబడుదామనుకున్న కరణ్‌ జోహార్‌కు నిరాశే ఎదురైంది.  
 

Kareena Kapoor: శృంగారంపై స్టార్ ప్రోడ్యూసర్‌ ప్రశ్న.. దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన కరీనా కపూర్‌!

Kareena Kapoor satires to Karan Johar over quality Romance in Koffee with Karan: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా చేస్తున్న 'కాఫీ విత్‌ కరణ్' టాక్‌ షో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ముఖ్యంగా సీజన్ 7లో  వరుసగా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్న కరణ్‌.. వారి రహస్యాలను బయటపెడుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ అన్నదమ్ములతో డేటింగ్.. విజయ్ దేవరకొండ కారులో శృంగారం.. సమంత టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటి విషయాలు  ప్రేక్షకుల్లో ఆసక్తిరేపాయి. ఇక బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రాబడుదామనుకున్న కరణ్‌కు నిరాశే ఎదురైంది. 

'కాఫీ విత్‌ కరణ్' ఐదో ఎపిసోడ్‌ ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రొమోలో 'లాల్‌ సింగ్‌ చద్దా' హీరోహీరోయిన్లు ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ సందడి చేశారు. ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు జోక్స్‌ వేసుకోవడంతో పాటు కరణ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. 'పిల్లలు పుట్టాక క్వాలిటీ శృంగారం అనేది కల్పితమా? వాస్తవమా?’ అని కరణ్‌ జోహార్‌ ప్రశ్నించగా.. ఈ విషయం 'మీకు తెలియదా?' అంటూ కరీనా కపూర్‌ పంచ్ ఇచ్చారు. దాంతో  స్టార్ ప్రోడ్యూసర్‌ కరణ్‌ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 

కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ... 'మా అమ్మ ఈ షో చూస్తారు. నా శృంగార జీవితం గురించి మాట్లాడటం బాగుండదు' అని కరీనా కపూర్‌కు బదులిచ్చారు. వెంటనే ఆమిర్‌ ఖాన్ అందుకుని.. 'మీరు ఇక్కడికి వచ్చిన వారందరి లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మీ అమ్మ పట్టించుకోవడం లేదు' అని రివర్స్ పంచ్ వేశారు. దాంతో ముగ్గురూ కలిసి నవ్వుకున్నారు. 'నా ఫ్యాషన్‌ సెన్స్‌కు ఎంత రేటింగ్‌ ఇస్తావ్‌' అని ఆమిర్‌ అడగ్గా.. మైనస్‌ అంటూ బెబో అన్నారు. ఇలా సరదాగా తాజా ప్రోమో ముగిసింది. ఈ ఎపిసోడ్‌ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!

Also Read: Reliance Jio: రిలయన్స్ జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రీఛార్జ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More