Home> వినోదం
Advertisement

Kapatadhaari​​ Theme Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న కపటధారి థీమ్ ట్రైలర్

Kapatadhaari​​ Theme Trailer: సుమంత్ హీరోగా నటించిన కపటధారి మూవీ ఫిబ్రవరి 19 విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన థీమ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కపటధారి థీమ్ ట్రైలర్‌లో చూపించిన దృశ్యాలు చూస్తోంటే.. సినిమాలో అనేక ట్విస్టులు, ఉత్కంఠకు గురిచేసే మలుపులు ఎన్నో ఉన్నాయనిపిస్తోంది.

Kapatadhaari​​ Theme Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న కపటధారి థీమ్ ట్రైలర్

Kapatadhaari​​ Theme Trailer: సుమంత్ హీరోగా నటించిన కపటధారి మూవీ ఫిబ్రవరి 19 విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన థీమ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కపటధారి థీమ్ ట్రైలర్‌లో చూపించిన దృశ్యాలు చూస్తోంటే.. సినిమాలో అనేక ట్విస్టులు, ఉత్కంఠకు గురిచేసే మలుపులు ఎన్నో ఉన్నాయనిపిస్తోంది. వృత్తిరీత్యా ట్రాఫిక్ పోలీస్ అయిన ఓ ఆఫీసర్.. క్రైమ్ విభాగం పోలీసులు కూడా ఛేదించలేని ఓ Murder mystery ని ఛేదిస్తే ఎలా ఉంటుందనేదే కపటధారి మూవీ కథాంశంగా అర్ధమవుతోంది. విజయ్ ఆంటోనీ నటించిన సైతాన్ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి కపటధారి సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. 

Also read : Anchor Anasuya item songs: హీటెక్కించే యాంకర్ అనసూయ ఐటం సాంగ్

ఇటీవలే హీరో నాగ చైతన్య Kapatadhaari​ trailer ని విడుదల చేయగా.. తాజాగా కపటధారి థీమ్ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సుమంత్‌తో పాటు నాజర్, నందితా శ్వేతా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథ్, సంపత్ వంటి నటీనటులు Kapatadhaari​ movie లో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రిషి, అనంత్ నాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం కవలుదారీకి ( Kavaludhaari ) తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా ఇది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More