Home> వినోదం
Advertisement

Kantara: మరో రికార్డు బద్దలు కొట్టిన కాంతార, రజనీకాంత్, యష్ సరసన రిషబ్ శెట్టి!

Kantara Telugu Version one More Record: కాంతార సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ఆ సినిమా తెలుగులో ఒక అరుదైన రికార్డు నెలకొల్పింది, ఆ వివరాల్లోకి వెళితే 

Kantara: మరో రికార్డు బద్దలు కొట్టిన కాంతార, రజనీకాంత్, యష్ సరసన రిషబ్ శెట్టి!

Kantara Telugu Version Stands as All time top4 Dubbed Movie: కన్నడలో సూపర్ హిట్ నిలిచిన కాంతార సినిమాని తెలుగు సహా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 14 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేవలం ఇండియాలో మాత్రమే ఈ సినిమా 350 కోట్లు రాబడితే మిగతా ప్రాంతాల్లో మరో ఆరు కోట్ల రాబట్టిందని అంచనా. మొత్తం మీద 400 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే వాస్తవానికి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎవరికీ అమ్మ లేదు కానీ గీతా సంస్థ ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది కమిషన్ బేసెస్ తో డిస్ట్రిబ్యూట్ చేసింది. అయినా సరే ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చాయి.

కేవలం రెండు కోట్ల రూపాయల మేర ఈ హక్కులు అమ్మారు కానీ సినిమా మొత్తం 65 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అలా ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయిన ఇతర భాషల సినిమాల్లో టాప్ ఫోర్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి స్థానంలో నిలవగా రజనీకాంత్ హీరోగా నటించిన 2.0 రెండవ స్థానంలో నిలిచింది. అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన రోబో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ కాంతార సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది. అలా రిషబ్ శెట్టి రజినీకాంత్, యష్ వంటి హీరోల సరసన చేరారు.

ఈ సినిమాకి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించడమే కాక హీరోగా కూడా నటించారు. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హోంబలే ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. కేజిఎఫ్ ప్రొడ్యూసర్స్ కావడంతో ఈ సినిమాకి మంచి గ్లోబల్ రీచ్ కూడా లభించింది. మంగళూరు ప్రాంతంలో అక్కడి ఆచారాలను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులు నాకట్టుకునే విధంగా సాగింది. ముఖ్యంగా భూత కోలా సమయంలో రిషబ్ శెట్టి నటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తుంది. మరోసారి ఇలాంటి పాత్ర దొరకదేమో అనే అంతగా రిషబ్ శెట్టి ఆ పాత్రలో లీనమై నటించాడు.
Also Read: Shweta Basu Prasad Hot Photos: వ్యభిచారం కేసులో పట్టుబడిన శ్వేతాబసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా?

Also Read: Ira Khan Engaged: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ నుపుర్ తో అమీర్ ఖాన్ కూతురి ఎంగేజ్మెంట్.. మాజీ భార్యలే కాదు ఆమె కూడా వచ్చిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More