Home> వినోదం
Advertisement

Kantara Records: కేజీఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టిన కాంతార.. 400 కోట్ల మార్క్ దాటేసి ముందుకు!

Kantara Movie Breaks KGF2 Records: కాంతార సినిమా వసూళ్ల వర్షం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడమే కాక కర్ణాటకలో ఈ సినిమా కేజిఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టింది.

Kantara Records: కేజీఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టిన కాంతార.. 400 కోట్ల మార్క్ దాటేసి ముందుకు!

Kantara Movie Breaks KGF2 Records: చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ సాధించిన కాంతార సినిమా వసూళ్ల వర్షం కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద కాంతార మిగతా అన్ని సినిమాలను డామినేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలయి ఇప్పటికే 50 రోజులు పూర్తి కావస్తున్నా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ మరిన్ని వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ సినిమా ఒక అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

అంతేగాక కర్ణాటకలో ఈ సినిమా కేజిఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమా కర్ణాటకలో కేజీఎఫ్ 2 వసూళ్లను క్రాస్ చేసి ఇప్పటివరకు 168 కోట్ల యాభై లక్షల కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 66 కోట్ల దాకా వసూలు చేయగా తమిళనాడులో 12 కోట్ల 70 లక్షలు, కేరళలో 19 కోట్ల 20 లక్షలు అదే విధంగా ఓవర్సీస్ లో 44 కోట్ల యాభై లక్షలు వసూలు చేసి కన్నడ సినీ పరిశ్రమలోనే టాప్ గ్రాఫర్స్ లో ఒకటిగా నిలిచింది.

అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్ అలాగే స్టార్ హీరోలు అనిపించుకున్న వారి సినిమాలు 100 కోట్ల మార్కు దాటడానికే కష్టపడుతున్న రోజుల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిన్న కన్నడ సినిమా 400 కోట్ల రూపాయల మార్క్ అందుకోవడం అనేది మామూలు విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ముందుగా సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుగులో అలాగే హిందీ, మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. సౌత్ లో దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా హిందీ బెల్ట్ లో 100 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఒక్క తెలుగులోనే దాదా 66 కోట్లు రూపాయలు కలెక్ట్ చేసిందంటే సినిమా సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.  రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసి హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ పాతలో నటించింది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో దేవుడిగా భావించే పంజుర్లి అనే ఒక దైవ ఆత్మకు సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందించారు. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్ ఇతర కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని హోంబలే ఫిలింస్ సంస్థ భారీ అంచనాలతో రూపొందించింది.

Also Read: Vishwak Sen : నక్కతోక తొక్కిన విశ్వక్ సేన్.. ఏకంగా 'సితార'తో సినిమా ఫిక్స్!

Also Read: Samantha No1: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా పాన్ ఇండియాలో నెం 1.. కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More