Home> వినోదం
Advertisement

Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్

Kannulu Chedire Lyrical Song from WWW Telugu Movie |  సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని ‘కన్నులు చెదిరే అందాన్నే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న Shivani Rajashekar సాంగ్స్‌లలో ఇది ఒకటి.

Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్

Kannulu Chedire Lyrical Song | ఆదిల్ అరుణ్, టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని ‘కన్నులు చెదిరే అందాన్నే’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాంగ్స్‌లలో ఇది ఒకటి.

అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను యాజిన్ నిజార్ అద్భుతంగా ఆలపించారు. టాలీవుడ్ నటుడు అడివి శేష్ రిలీజ్ చేసిన కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూశానే.. సాంగ్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. వయోలిన్ శ్రావన్, డ్రమ్స్ వసంత్ డేవిడ్, ఫ్లూట్ ఫిన్నీ ప్లే చేయగా.. సిమోన్ కే కింగ్ స్వరాలు సమకూర్చారు. ఆదిల్ అరుణ్, శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar)పై తెరకెక్కించిన ఈ సాంగ్ వీడియో సాంగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మా రామంత్ర క్రియేషన్స్ బ్యానర్‌లో డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమా (WWW Telugu Movie)ను నిర్మించారు. ఇటీవల విడుదలైన సాంగ్ ఒక మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. మీరు కూడా ఆ లిరికల్ వీడియో సాంగ్ వీక్షించండి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More