Home> వినోదం
Advertisement

Bollywood: సంజయ్ దత్‌ను కలిసిన కంగనా రనౌత్

బాలీవుడ్ సూపర్‌ స్టార్ సంజ‌య్ ద‌త్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్‌ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్స‌ర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2  చిత్ర బృందంలో చేరాడు.

Bollywood: సంజయ్ దత్‌ను కలిసిన కంగనా రనౌత్

Kangana Ranaut meets Sanjay Dutt in Hyderabad: బాలీవుడ్ సూపర్‌ స్టార్ సంజ‌య్ ద‌త్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్‌ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్స‌ర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 (KGF 2)  చిత్ర బృందంలో చేరాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్.. అంధేరి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో నడుస్తోంది. ఈ మేరకు సంజయ్ దత్ హైదరాబాద్‌లోనే ఉంటూ రెగ్యూలర్‌గా షూటింగ్‌గు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో తలైవి షూటింగ్ కోసం హైదరాబాద్ (Hyderabad) వచ్చిన బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut ) సంజయ్ దత్‌ను కలిసింది.

ప్రస్తుతం త‌లైవి (Thalaivi) చిత్ర షూటింగ్ కూడా నగరంలోనే జరుగుతోంది. అయితే సంజయ్ దత్ ఉంటున్న హోటల్‌లోనే కంగనా కూడా ఉంటోంది. ఇది తెలుసుకున్న కంగనా.. త‌న అభిమాన న‌టుడు సంజ‌య్‌ దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరస్థితి గురించి తెలుసుకుంది. ఈ మేరకు కంగనా.. సంజయ్ దత్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ రోజు తాను సంజ‌య్‌దత్‌ను క‌లిశానని, ఆయ‌న చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారంటూ ట్విట్ చేసింది. సంజయ్‌కు ఆయురారోగ్యాలు అందించాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ కంగ‌నా శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. Also read: Sanjay Dutt: కేన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్

Also read: Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్

Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More