Home> వినోదం
Advertisement

Vijay Devarakonda: కరణ్ జోహార్ తో దేవరకొండకు అఫైర్ అంటూ క్రిటిక్ దారుణ వ్యాఖ్యలు.. అందుకే ఆమెకు ఐదు సినిమాలు?

Kamal R Khan Targets Vijay Devarakonda: పలువురిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఎక్కే కమల్ ఆర్ ఖాన్ ఈసారి విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, రష్మిక మందన్నాలను టార్గెట్ చేశాడు. ఈ మేరకు కేఆర్కే ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందన్నా అభిమానులు అతని మీద విరుచుకు పడుతున్నారు. 

Vijay Devarakonda: కరణ్ జోహార్ తో దేవరకొండకు అఫైర్ అంటూ క్రిటిక్ దారుణ వ్యాఖ్యలు.. అందుకే ఆమెకు ఐదు సినిమాలు?

Kamal R Khan Targets Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. సారా అలీ ఖాన్ ఆయనతో డేటింగ్ చేయాలని ఉందంటూ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ మీడియా మొదలు టాలీవుడ్ మీడియా వరకు దాని గురించి కథనాలు వెలువరించింది. అయితే అనూహ్యంగా బాలీవుడ్ కి చెందిన ఒక వివాదాస్పద స్వయం ప్రకటిత క్రిటిక్ విజయ్ దేవరకొండ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలువురిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఎక్కే కమల్ ఆర్ ఖాన్ ఈసారి విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, రష్మిక మందన్నాలను టార్గెట్ చేశాడు.

ఈ మేరకు కేఆర్కే ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందన్నా అభిమానులు అతని మీద విరుచుకు పడుతున్నారు. అతను ట్వీట్ చేసిన దాని ప్రకారం ఒక సీక్రెట్ మీడియా న్యూస్ ఏమిటంటే విజయ్ అనకొండ, కరణ్ జోహార్ కొత్త బాయ్ ఫ్రెండ్ అదే సమయంలో రష్మిక మందన్నా విజయ్ గర్ల్ ఫ్రెండ్ కావడంతో కరణ్ జోహార్ రష్మికకు ఐదు హిందీ సినిమాలు వచ్చేలాగా సహాయం చేశాడు అంటూ ట్వీట్ చేయడంతో కలకలం రేగింది.

నిజానికి కరణ్ జోహార్ ఒక స్వలింగ సంపర్కుడు అంటూ పెద్ద ఎత్తున బాలీవుడ్ మీడియాలో ఒకప్పుడు ప్రచారం జరిగింది. అది నిజం కాదని ఆయన అనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చినా ఇలా ఏదో ఒక విషయంలో ఆయన పేరు లాగుతూ వివాదం చేయడం పరిపాటిగా మారింది. అంతేకాక విజయ్ దేవరకొండ హీరోగా కరణ్ జోహార్ నిర్మాతగా నిర్మిస్తున్న లైగర్ సినిమా గురించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. లైగర్ పాటలు విని చాలామందికి చెవుడు వచ్చిందట సినిమా చూస్తే చాలా మందికి కళ్ళు పోతాయి అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే కమల్ ఆర్  ఖాన్ చేసిన కామెంట్లు సరికాదంటూ దక్షిణాదికి చెందిన విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందన అభిమానులు అతని మీద విరుచుకు పడుతున్నారు. ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు పెట్టడం డిలీట్ చేయడం అతనికి పరిపాటే. మరి చూడాలి ఈసారి ట్వీట్ ఉంచుతాడో లేక డిలీట్ చేస్తాడో.
Read Also: The Warriorr: ది వారియర్ కు వరుణ గండం.. హైద్రాబాద్లో మరీ దారుణంగా అమ్మకాలు.. ఇలా అయితే కష్టమే!

Read Also: Dil Raju: కొడుక్కి ఆసక్తికరమైన పేరు పెట్టిన దిల్ రాజు.. ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా ఏమి పెట్టారంటే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More