Home> వినోదం
Advertisement

Kalyaan Dhev Valentines day Post : ప్రేమలో అదే ముఖ్యమా?.. కళ్యాణ్‌ దేవ్ పోస్ట్ వైరల్.. విడాకులకు అదే కారణమా?

Kalyaan Dhev Sreeja Konidela Divorce కళ్యాణ్‌ దేవ్ శ్రీజల మధ్య ఉన్న బంధం మీద ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైంది. కానీ విడాకుల మీద ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

Kalyaan Dhev Valentines day Post : ప్రేమలో అదే ముఖ్యమా?.. కళ్యాణ్‌ దేవ్ పోస్ట్ వైరల్.. విడాకులకు అదే కారణమా?

Kalyaan Dhev Valentines day Post కళ్యాణ్‌ దేవ్ తన బర్త్ డేకు మరిచిపోలేని బహుమతి దొరికింది. నిన్న జరిగిన తన పుట్టిన రోజు వేడుకలకు తన కూతురు నవిష్క వచ్చింది. తన బర్త్ డే సందర్భంగా తన కూతురు నాలుగో పుట్టిన రోజు వేడుకలను కూడా సెలెబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్‌ దేవ్. ఇంత కంటే గొప్ప బహుమతి నాకు ఇంకెక్కడా దొరకదు అంటూ తన బర్త్ డే నాడు కూతురితో ఆడుకుంటూ మురిసిపోయాడు కళ్యాణ్‌ దేవ్. అది చూసిన జనాలు కూడా నిజంగానే ఎమోషనల్ అయ్యారు

అయితే ఆ వీడియోను చూసిన జనాలు కళ్యాణ్‌ దేవ్ మీద పాజిటివ్ కామెంట్లు చేశారు. ఎందుకు విడిపోయారు.. కారణాలు ఏంటి? అని అడిగేశారు. మీరు విడిపోయినా కూడా కూతురి కోసం ఆరాట పడుతున్నారు.. కూతురిని బాగా చూసుకుంటున్నారు.. మీరు గ్రేట్ డాడీ అంటూ కళ్యాణ్‌ దేవ్ మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

fallbacks

కళ్యాణ్ దేవ్ శ్రీజల విడాకుల మీద ఇంత వరకు అయితే క్లారిటీ రాలేదు. ఏ విషయంలో తేడా కొట్టి వీరి వ్యవహారం ఇంత వరకు వచ్చింది.. విడాకులు తీసుకునేంతగా ఏమై ఉంటుందంటూ ఇలా జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్ చూస్తుంటే.. పరోక్షంగా తాను ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పకనే చెప్పినట్టుగా అనిపిస్తుంది.

ఎదుటి వాళ్లు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ కళ్యాణ్‌ దేవ్ ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. దీంతో కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం జరిగిందా? అందుకే విడిపోయాడా? దూరంగా ఉంటున్నాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఏది ఏమైనా కళ్యాణ్‌ దేవ్ సినీ కెరీర్‌ మాత్రం అగమ్యగోచరంగా మారింది. సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలకు మెగా సపోర్ట్ దక్కలేదు. దీంతో ఆ సినిమాలు వచ్చినట్టుగా పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలియకుండానే పోయాయి. ఇప్పుడు మరో సినిమా అప్డేట్‌ను కళ్యాణ్‌ దేవ్ ఇవ్వలేకపోతోన్నాడు. కానీ తన బాడీని మాత్రం కళ్యాణ్‌ దేవ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఏదైనా కారెక్టర్ కోసం అలా బాడీని మెయింటైన్ చేస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More