Home> వినోదం
Advertisement

NTR Serious Looks on Anchor Suma: ఇరికించిన సుమ, సీరియస్ అయిన ఎన్టీఆర్.. ఇంత సీరియస్ గా తారక్ ని చూసి ఉండరు

Jr NTR Serious Look: కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవగా అక్కడ సుమ మీద సీరియస్ అయ్యారు. 
 

NTR Serious Looks on Anchor Suma: ఇరికించిన సుమ, సీరియస్ అయిన ఎన్టీఆర్.. ఇంత సీరియస్ గా తారక్ ని చూసి ఉండరు

Jr NTR Serious Looks on Anchor Suma: ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు..? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అనే అంశం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేసిన రామ్ చరణ్ అనేక సినిమాలు లైన్ లో పెట్టడమే కాక ప్రకటనలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్:

తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు అక్కడ కూడా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు ఐదున్నర, ఆరు గంటలకల్లా చేరుకుంటారు అదే హీరోలు ఇతర సినిమా యూనిట్ అంతా రావడానికి సమయం పడుతుంది కాబట్టి వారిని అలరించడానికి యాంకర్లు నానా తంటాలు పడుతూ ఉంటారు.

సుమ మీద సీరియస్ గా

డైరెక్ట్ గా మైకులు తీసుకెళ్లి అభిమానుల ముందు పెట్టడంతో వారు తమ మనోభావాలను బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో నిన్న అనేకమంది అభిమానులు ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ కోరడంతో అదే విషయాన్ని సుమ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఆయనకు చెప్పింది. అయితే ఎందుకో గాని ఎన్టీఆర్ ఈ విషయంలో సీరియస్ అయ్యాడు, సుమ మీద సీరియస్ గా లుక్స్ ఇస్తూ చాలా కోప్పడుతున్నట్లు కనిపించింది. 

ఎన్టీఆర్ ని కళ్యాణ్రామ్ సముదాయించేందుకు ప్రయత్నించగా చివరికి కాస్త స్థిమిత పడిన ఎన్టీఆర్ మైక్ తీసుకుని అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే అంటూ సుమకు కౌంటర్ వేసి తర్వాత అభిమానుల దగ్గరకు వెళ్లి వేడుకున్నాడు. ఎన్టీఆర్ 30 అప్డేట్ అనే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమే బయట పెడతాం, అదేదో మేము కావాలని దాచుకున్నట్లుగా అప్డేట్ కావాలి కావాలి అని అడుగుతుంటే దర్శక నిర్మాతల మీద ప్రెజర్ పడుతుంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండని అన్నాడు.

గోల చేయకండి అంటూ

ఇలాంటి విషయాల్లో మాకు మా కుటుంబ సభ్యుల కంటే అభిమానులే ఎక్కువ, మా భార్యల కంటే ముందు ఏ విషయం ఉన్నా మీ ముందుకే తీసుకువస్తాం అంటూ ఎన్టీఆర్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపించింది. ఒకానొక దశలో ఎన్టీఆర్ ఏంటి ఇంత సీరియస్ అయ్యాడు, సుమను ఏమైనా అంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ స్థితప్రజ్ఞుడు కావడంతో తన కోపాన్ని అణగదొక్కుకుని అసలు విషయం ఇది అని అభిమానుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఇక అభిమానులకు ఎన్టీఆర్ 30 అప్డేట్ ఇవ్వడమే కాక దయచేసి ఇకమీదట అప్డేట్స్ అప్డేట్స్ అని గోల చేయకండి అంటూ క్లాస్ కూడా పీకాడు. 

Also Read: NTR 30 Update : ఇలా ఒత్తిడి పెంచొద్దు.. మా భార్యల కంటే ముందే మీకు చెబుతాం.. వేడుకున్న ఎన్టీఆర్

Also Read: Amigos Pre Release Event : నా గుండెకాయ, నా తమ్ముడు.. ఎన్టీఆర్ మీద ప్రేమను కురిపించిన కళ్యాణ్‌ రామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
Read More