Home> వినోదం
Advertisement

Samantha Birthday : సమంతను పట్టించుకోని టాలీవుడ్ టాప్ హీరోలు.. కావాలనే విష్ చేయడం లేదా?

Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే సమంతకు విషెస్ చెప్పేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. టాప్ హీరోలైన రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు సైలెంట్‌గానే ఉన్నారు.

Samantha Birthday : సమంతను పట్టించుకోని టాలీవుడ్ టాప్ హీరోలు.. కావాలనే విష్ చేయడం లేదా?

Samantha Ruth Prabhu Birthday సమంత దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసింది. అందరితోనూ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరితోనూ సినిమాలు చేసింది. బ్లాక్ బస్టర్‌ హిట్లు కొట్టేసింది. ఎన్టీఆర్‌తో, బన్నీతో అయితే రెండు మూడు సినిమాలు చేసింది. రామ్ చరణ్‌తో రంగస్థలం చేసింది. ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే సమంతకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు మాత్రం వీళ్లెవ్వరూ ముందుకు రావడం లేదు.

సమంతకు కీర్తి సురేష్‌, రుహనీ శర్మ, అనుష్క శర్మ, సుకుమార్ భార్య, మంచు లక్ష్మీ, లావణ్య త్రిపాఠి, రష్మిక మందాన్న ఇలా టాలీవుడ్ హీరోయిన్లంతా కూడా స్పందిస్తున్నారు. సమంతకు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. అయితే హీరోలు మాత్రం ఎవ్వరూ కూడా స్పందించడం లేదు. సాయి ధరమ్ తేజ్ మాత్రం తనకు ఎంతో ఇష్టమైన నటి సమంత కాబట్టి.. ట్వీట్లు పెట్టాడు. సమంతకు విషెస్ చెప్పాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా సమంతకు విషెస్ చెప్పాడు.

సమంత మాత్రం టాలీవుడ్ హీరోలకు విషెస్ చెబుతుంటుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇలా అందరికీ విషెస్ చెబుతుంటుంది. వారి సినిమాల మీద స్పందిస్తుంటుంది. సమంతకు మాత్రం ఇలా హీరోలు కనీసం విషెస్ కూడా చెప్పడం లేదు. సమంతకు విషెస్ చెబుతూ పోస్టులు వేయలేదా? లేదంటే.. పర్సనల్‌గా మెసెజ్‌లు పెట్టి ఉంటారా? అసలు సమంతను వారు పట్టించుకోవడం లేదా? అన్నది క్లారిటీగా తెలియడం లేదు.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

సమంత బర్త్ డే స్పెషల్‌గా ఖుషి నుంచి పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో మైత్రీ సంస్థ ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ వంటి వారు సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం వరకైనా మన హీరోలు సమంతకు విషెస్ చెబుతారా? లేదా? అన్నది చూడాలి. 

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More