Home> వినోదం
Advertisement

Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటన ?

Jr Ntr birthday on 20th May: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఎంతో దూరంలో లేదు. మే 20వ తేదీనే తారక్ బర్త్ డే కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుపై ఓ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటన ?

Jr Ntr birthday on 20th May: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఎంతో దూరంలో లేదు. మే 20వ తేదీనే తారక్ బర్త్ డే కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుపై ఓ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే తారక్ బర్త్ డే నాడు తారక్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న చిత్రంపై మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందట. ప్రస్తుతం కరోనా సంక్షోభం నడుస్తున్నందున తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోగా.. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తారక్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించి ప్రకటించేందుకు తారక్ బర్త్ డే కంటే కరెక్ట్ టైమ్ మరొకటి లేదని భావిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. 

Also read : Pawan Kalyan తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్న Jacqueline Fernandez

ఎన్టీఆర్ 30వ చిత్రం (NTR30) పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా (Jr Ntr-Prashanth Neel film) పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమాను రిలీజ్ చేసేలా సినిమాను ప్రారంభించి షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలనే యోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్టు సమాచారం. తారక్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ మూవీతో (RRR movie) తారక్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also read : Mahesh Babu సినిమాలో శిల్పా శెట్టి పాత్ర ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More