Home> వినోదం
Advertisement

Devara: దేవరా సినిమాకి 9 సెంటిమెంట్.. అసలు దీని వెనుక కథ ఏమిటంటే..!

NTR Devara 9 Sentiment: స్టార్ డైరెక్టర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. కొంతమంది తమ సినిమాల విషయంలో సెంటిమెంట్లు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి త్రివిక్రమ్ తన సినిమాల్లో.. ఇద్దరు హీరోయిన్లు ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ విషయంలో నంబర్ సెంటిమెంట్ గురించి చాలామందికి తెలిసిందే. 9 అంటే బాగా ఇష్టపడే ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ వాడుతున్నట్లు సమాచారం.
 

Devara: దేవరా సినిమాకి 9 సెంటిమెంట్.. అసలు దీని వెనుక కథ ఏమిటంటే..!

Devara Trailer Release: టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 9 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం. 9 తన లక్కీ నంబర్ అని ఎన్టీఆర్ చాలా కచ్చితంగా నమ్ముతూ ఉంటారు. అందుకే చాలా వరకు తన విషయాల్లో తొమ్మిది ఉండేలాగా.. చూసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తన వద్ద ఎన్ని కార్లు ఉన్నా కూడా వాటికి 9999 అనే నంబర్ మాత్రమే వచ్చేలాగా చూస్తూ ఉంటారు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. ఎన్ని తొమ్మిదిలు ఉన్నా.. వాటిని కూడితే చివరికి వచ్చేది.. కూడా తొమ్మిదే. అయితే సినిమాల విషయంలో మాత్రం ఎన్టీఆర్ అంత పర్టికులర్ గా ఉండరు. చాలా వరకు విషయాలు దర్శకుడు వదిలేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో.. చిత్ర బృందం కూడా ఎన్టీఆర్ తొమ్మిది సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.

మొదటగా సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడితే.. సినిమా విడుదల అవుతున్నది సెప్టెంబర్ నెలలో. అంటే సంవత్సరంలో అది 9వ నెల. ఇక విడుదల తేదీ సెప్టెంబర్ 27. ఆ డేట్ లోని 2 + 7 చేస్తే వచ్చేది కూడా తొమ్మిదే. విడుదల తేదీ మాత్రమే కాదు.. విడుదల సమయం కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు చెప్పుకోవచ్చు. 

ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎర్లీ మిడ్ నైట్ షోలు పడుతున్న.. ఆ విషయం తెలిసిందే. సినిమా ప్రీమియర్లు అర్ధరాత్రి 1:08 కి పడనున్నాయి. వాటిని కూడినా కూడా.. 9 వస్తుంది. ఇలా కావాలనే చిత్తబృందం కూడా ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన తొమ్మిది సెంటిమెంట్ బాగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా 9 నెంబర్ వచ్చేటట్టే ఏదో ఒక డేట్ లో విడుదల చేయాలని చూస్తున్నారు సినిమా యూనిట్.

కొరటాల శివ.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమా విషయంలో 9 సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

Also Read: Bengal Bandh: రణరంగంగా  మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More