Home> వినోదం
Advertisement

War 2: బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ కు ఇదే నిదర్శనం.. వార్ 2 సెట్స్ పై ఉండగానే మరో బిగ్ ప్రాజెక్ట్ లో తారక్.. !

NTR - Hrithik - War 2: ఆర్ఆర్ఆర్ మూవీతో మల్టీస్టారర్ మూవీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ సినిమా పూర్తి కావొచ్చింది. తాజాగా వార్ 2 సినిమాతో ఈ సినిమాకు సీక్వెల్ వార్ 3లో కూడా ఎన్టీఆర్ భాగస్వామి  కానున్నట్టు సమాచారం.

War 2: బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ కు ఇదే నిదర్శనం.. వార్ 2 సెట్స్ పై ఉండగానే మరో బిగ్ ప్రాజెక్ట్ లో తారక్.. !

NTR - Hrithik - War 2: ప్రెజెంట్ దేశ వ్యాప్తంగా   ప్యాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా  తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది. త్వరలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై భారీ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో వార్ 3 కి సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారట. అంతేకాదు ఈ సిరీస్ లో ఎన్టీఆర్ కంటిన్యూ అవుతున్నారట. తారక్ వల్ల ఈ  స్పై యూనివర్స్ కు సౌత్ లో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయట. దాంతోపాటు షారుఖ్ ఖాన్ నటిస్తూన్న ‘పఠాన్ 2’ తో పాటు టైగర్ వర్సెస్ పఠాన్ మూవీల్లో కూడా ఎన్టీఆర్ ముఖ్యపాత్రలో నటించడం దాదాపు ఖాయమైందట.

ఆయా సినిమాల్లో నటించినందకు గాను ఎన్టీఆర్ కు ఈ సీరిస్ లకు కలిపి దాదాపు రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ నెలాఖరకు వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కానుందట. అంతేకాదు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జనవరి 26న విడుదల చేయాలనే ప్లాన్ ల ఉన్నారు.

ఎన్టీఆర్ ఇతర సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర 1’ ను సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. అటు దేవర 2 పార్ట్ ను వచ్చే యేడాది ఏప్రిల్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీ వచ్చె నెల సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా 2025 డిసెంబర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నారు. మరోవైపు వార్ 2, పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ వంటి బాలీవుడ్ స్పై యూనివర్స్ చిత్రాల్లో నటించనున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ వరుసగా ప్యాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టబోతున్నాడనే చెప్పాలి.  మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. అది కల్కి యూనివర్స్ లో నటిస్తాడా.. ? మరేదైనా చిత్రంలో యాక్ట్ చేస్తాడా అనేది చూడాలి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More